WhatsApp Self Chat : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
WhatsApp Self Chat : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. సెల్ఫ్ చాట్ (Whatapp Self Chat) ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ స్నేహితులు, ఇతర కాంటాక్టులకు మాత్రమే కాకుండా సెల్ఫ్ చాట్‌లో కూడా మెసేజ్‌లను పంపేందుకు అనుమతిస్తుంది.

How to WhatsApp yourself _ A step-by-step guide
WhatsApp Self Chat : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో కొత్త ఫీచర్ వస్తోంది. అదే.. సెల్ఫ్ చాట్ (Whatapp Self Chat) ఫీచర్.. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ స్నేహితులు, ఇతర కాంటాక్టులకు మాత్రమే కాకుండా సెల్ఫ్ చాట్‌లో కూడా మెసేజ్‌లను పంపేందుకు అనుమతిస్తుంది.
వాట్సాప్‌లో నోట్స్ రాసుకోవడానికి కూడా ఈ కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి ఫీచర్ అధికారికంగా ప్రవేశపెట్టలేదు. కానీ, ఇప్పుడు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ‘message yourself’ అనే కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ మెసేజ్ మీరే ఫీచర్ యూజర్లు తమతో 1:1 చాట్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు తాముగా నోట్స్ పంపుకోవచ్చు. ఇతర యూజర్లకు రిమైండర్‌లను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కొత్త ‘message yourself’ ఫీచర్ ద్వారా WhatsApp యూజర్లు తాము చేయాల్సిన పనులను ట్రాక్ చేయవచ్చు. నోట్స్, రిమైండర్‌లు, షాపింగ్ లిస్టులను మొదలైనవాటిని పంపవచ్చు.
ఈ ఫీచర్ రాబోయే నెలల్లో దశలవారీగా ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. మీరు ఇంకా ఫీచర్‌ని పొందకుంటే.. దశలవారీగా మీకు అందుబాటులోకి రానుంది. WhatsApp ఆటో-అప్‌డేట్ పొందాలంటే మీ యాప్ స్టోర్‌కి వెళ్లవచ్చు. ముందుగా వాట్సాప్ (Whatsapp Update) యాప్‌ను అప్‌డేట్ చేయండి. యాప్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ అయిన తర్వాత ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

How to WhatsApp yourself _ A step-by-step guide
వాట్సాప్ మెసేజ్ మీకు మీరే ఎలా పంపుకోవాలో తెలుసా? :
* యాప్ అప్‌డేట్ అయిన తర్వాత ఫోన్‌లో మీ WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
* ఆ తర్వాత, కొత్త చాట్‌ని క్రియేట్ చేయండి.
* మీరు ఇప్పుడు మీ కాంటాక్టును లిస్టు ఎగువన చూడవచ్చు.
* వాట్సాప్ ఫీచర్ ఇప్పటికీ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి.
* మీ కోసం అప్‌డేట్ రిలీజ్ కావడానికి మీరు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
* అప్‌డేట్ మీకు అందుబాటులో ఉంటే.. మీ నంబర్‌పై క్లిక్ చేసి, మెసేజ్ పంపుకోవచ్చు.
వాట్సాప్ ఇటీవల ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీచర్లలో ఒకదాన్ని ఆవిష్కరించింది. దీనిని ‘hide online status’ అంటారు. ఈ ప్రైవసీ ఫీచర్ యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరికి కావాలంటే వారి నుంచి హైడ్ చేసి సీక్రెట్‌గా చాట్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఈ ఫీచర్ యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్ అందరి నుంచి హైడ్ చేయడానికి లేదా కాంటాక్టులను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. Hide Online Status ఫీచర్ iOS, Android యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పుడు, మీరు ఇప్పటికీ అప్‌డేట్‌ని అందుకోలేదంటే.. యాప్ స్టోర్‌కి వెళ్లి WhatsApp యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..