IFS officer Parveen Kaswan : సిగ్గుపడే జంతువుని చూసారా?.. IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు చూడండి..
జంతువుల్లో అత్యంత పిరికి జంతువు గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా చూశారా? IFS ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో చూడండి.

IFS officer Parveen Kaswan
IFS officer Parveen Kaswan : సిగ్గుపడే జంతువుని ఎప్పుడైనా చూసారా? అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఆ జంతువు వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
IFS అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. వన్య ప్రాణులకు సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల ”అత్యంత పిరికి జంతువుని ఎంతమంది గుర్తించగలరు..భూమిపై ఎక్కువగా రవాణా చేయబడిన రెండవ జంతువు.. ఇది క్షీరదం’ అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో Parveen Kaswan IFS ఓ పోస్టు పెట్టారు.
తరువాత మరో పోస్ట్‌లో ‘ఇది పాంగోలిన్.. పాంగోలిన్ హాని చేయని జంతువు. చైనీస్, ఇండియన్ పాంగోలిన్‌లు ఇండియాలో పెద్ద ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీడియోలో కనిపిస్తున్న ఈ పాంగోలిన్‌ను అక్రమంగా రవాణా చేస్తుంటే మా బృందాలు స్మగ్లర్ల నుంచి కాపాడారు. ఆ తరువాత పాంగోలిన్‌ను అడవిలో విడిచిపెట్టారు’ అంటూ పర్వీన్ కస్వాన్ రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?
‘పాంగోలిన్‌ను స్కేలీ యాంటిటర్ అని కూడా పిలుస్తారు’ అని ఒకరు.. ‘పాంగోలిన్. మరాఠీలో ఖవలే మంజర్ అంటాం’ అని మరొకరు స్పందించారు. అయితే పాంగోలిన్ మాత్రం అత్యంత పిరికి, సిగ్గుపడే జంతువుగా అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
How many can identity this shy animal. Considered as second most trafficked #mammal on the #earth. pic.twitter.com/oUGzKrUGWA
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 8, 2023