IIM Alumni: పాల ప్యాకెట్స్‌పై ఓ ముద్ర.. సోషల్ మీడియాలో రచ్చ!

ఓ కంపెనీ మాత్రం పాల ప్యాకెట్ పై ఓ ముద్రతో బ్రాండ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఓ కంపెనీ తమ మిల్క్ ప్యాకెట్ పై Founded By IIM Alumni అని ముద్రించింది.

IIM Alumni: పాల ప్యాకెట్స్‌పై ఓ ముద్ర.. సోషల్ మీడియాలో రచ్చ!

Iim Alumni (1)

Updated On : March 15, 2022 / 8:52 PM IST

IIM Alumni: అందరికీ పాలు అవసరమే కాగా ఎక్కువ శాతం మంది ఆధారపడేది మిల్క్ ప్యాకెట్స్ పైనే అని అందరికీ తెలిసిందే. ఏ కంపెనీ పాల ప్యాకెట్ అయినా దానిపై కొన్ని వివరాలు కామన్‌గా ఉంటాయి. ప్యాక్ చేసిన తేదీ.. ఎక్స్పైర్ డేట్.. మిల్క్‌లో ఫ్యాట్ శాతం అలా వివరాలు ఉంటాయి. ఎక్కడో పల్లెటూర్లు, సిటీ చివర్లు మినహా సిటీలలో గేదె, ఆవు పాలు దొరకడం చాలా అరుదు. అక్కడక్కడా ఫ్రెష్ మిల్క్ సెంటర్లు ఉన్నా.. సరఫరా చాలా తక్కువే. దాదాపు తొంబై శాతానికి పైగా ప్యాకెట్ పాలే ఉపయోగిస్తారు.

Hijab Row: సుప్రీం కోర్టు మెట్లెక్కనున్న ముస్లిం విద్యార్థులు

అందుకే పాలు ప్యాక్ చేసే కంపెనీల మధ్య చాలా పోటీ ఉంటుంది. ఇక మార్కెట్ లోకి వచ్చే కొత్త కంపెనీలు అయితే తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకొనేందుకు కొందరు భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తుంటారు. అయితే.. ఓ కంపెనీ మాత్రం పాల ప్యాకెట్ పై ఓ ముద్రతో బ్రాండ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఓ కంపెనీ తమ మిల్క్ ప్యాకెట్ పై Founded By IIM Alumni అని ముద్రించింది. ఇప్పుడు ఆ పేరు ముద్రించబడడం చర్చకు తావిస్తోంది. Founded By IIM Alumni అంటే ఐఐఎం పూర్వ విద్యార్థి స్థాపించబడింది అని అర్ధం.

పాల ప్యాకెట్స్‌పై IIM Alumni ముద్ర రచ్చ

ముందుగా ఓ వ్యక్తి మిల్క్ ప్యాకెట్ మీద IIM Alumni అనే ముద్రను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారి అందరూ దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఓ పాల ప్యాకెట్‌పై తన కాలేజీ పేరు వేసుకోవడం నెటిజన్స్‌లో చర్చకి తెరలేపుతోంది. IIM కాలేజీ పేరు చెప్పుకుని కాదు క్వాలిటీతో పేరు తెచ్చుకోవాలని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు తప్పేముంది తాను చదువుకున్న కాలేజీ పేరు ముద్రించుకున్నాడని వెనకేసుకొస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు IIM Alumni ముద్ర మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Eiffel Tower: 19 అడుగుల ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్

View also