Indian Army Target POK : ‘కనుసైగ చేస్తే చాలు’.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ఆర్మీ కమాండ్ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం కనుసైగ చేస్తే చాలు..పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం అంటూ భారత ఆర్మీ కమాండ్ ద్వివేదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Indian Army Target POK : ‘కనుసైగ చేస్తే చాలు’.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ఆర్మీ కమాండ్ సంచలన వ్యాఖ్యలు

Indian Army Target POK

Indian Army Target POK : అసాధ్యమనుకున్న ఆర్టికల్ 370 ఎత్తివేతను సుసాధ్యం చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు తన తదుపరి లక్ష్యంపై దృష్టిపెట్టిందా..? దశాబ్దాలుగా తీరని కలగా మారిన లక్ష్యాసాధనకు త్రివిధ దళాలను సిద్ధం చేసిందా..? అన్ని విధాలా అనుకూలంగా ఉన్న సమయాన్ని ఎంచుకుని తన కార్యాచరణ ప్రారంభించనుందా…? 2019లో రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే ఆర్టికల్ 370ని ఎత్తివేసిన ప్రధాని..ఈ పదవీకాలం ముగిసేలోపు ఊహలకందని సంచలనాలు నమోదుచేసేందుకు సిద్ధమయ్యారా…? ప్రపంచ దేశాలన్నీ రష్యా, యుక్రెయిన్ యుద్ధం, చైనా, తైవాన్ ఉద్రిక్తతలపై దృష్టిపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తదుపరి అడుగు…ప్రపంచాన్ని నివ్వెరపరచనుందా..? అంటే అవుననే సమాధానం లభిస్తోంది. దీనికి కారణం ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ఆదేశాలిస్తే…వాటిని అమలుచేయడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకోవడం వంటి ఎలాంటి ఆదేశాలను ప్రభుత్వం ఎప్పుడిచ్చినా…అమలుచేసేందుకు ఆర్మీ అన్నివిధాలా అప్రమత్తంగా ఉందని ద్వివేది తెలిపారు. గత నెల 28న కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తిరిగి తీసుకుంటామని, శరణార్థులందరూ వారి భూమి, ఇళ్లు తిరిగి పొందుతారని వ్యాఖ్యానించారు. దీనిపైనే తాజాగా ద్వివేది స్పందించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆర్మీ ఎప్పుడూ ఉల్లంఘించబోదని, ప్రత్యర్థి దేశం ఉల్లంఘిస్తే..సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ద్వివేది చేసిన వ్యాఖ్యలపై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. నిజానికి అఖండ భారత్…ఆరెస్సెస్ కల. బీజేపీ సిద్ధాంతాలన్నీ ఆరెస్సెస్ ప్రాతిపదికగానే ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అఖండ భారత్ సాధ్యం కాకపోవచ్చు కానీ…కేంద్రం తలచుకుంటే..పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌లో స్వాధీనం చేసుకోవడం సాధ్యమే. పదేళ్ల క్రితం దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రాకముందు జమ్మకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఎత్తివేత ఊహకందని విషయం.

రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే..తమ కల, ఎన్నికల హామీ అయిన జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్రం ఎత్తివేసింది. అదే తరహాలో వచ్చే ఎన్నికల్లోపు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ వైపు భారత బలగాలు కదిలే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కశ్మీర్ పునరేకీకరణ అంటే మరో యుద్ధమే…ఇది ప్రపంచ దేశాల్లో పెను సంచలనమే. ఏయే దేశం ఎవరి పక్షం వహిస్తుందన్నది పక్కనపడితే… ఈ యుద్ధం….రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని మించి చర్చనీయాంశమవుతుంది.

అటు పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల కుప్పగా మారింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయింది. అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో అల్లాడుతోంది. కొత్త ఆర్మీ చీఫ్‌ను నియమించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇన్ని కష్టనష్టాలు ఉన్నప్పటికీ..భారత్ పీవోకే స్వాధీన చర్య మొదలుపెడితే…పాకిస్తాన్ ఊరుకోదు. చైనాతో పాటు తన మిత్రదేశాల సాయం తీసుకుని మరీ భారత్‌కు బదులిస్తుంది. అయినప్పటికీ…గత యుద్ధాల్లానే పాకిస్థాన్‌ను ఓడించి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు త్రివిధ దళాలు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రం కనుసైగ కోసం ఎదురుచూస్తున్నాయి.