లాక్‌డౌన్‌లో బోర్.. ఇండియన్స్ స్నాక్స్ తెగ తినేశారంట!

  • Published By: sreehari ,Published On : December 11, 2020 / 06:46 PM IST
లాక్‌డౌన్‌లో బోర్.. ఇండియన్స్ స్నాక్స్ తెగ తినేశారంట!

Indians snack more amid pandemic to overcome boredom :  ప్రపంచానికి కరోనా వైరస్ అన్ని నేర్పింది.. బతకడం ఎలానో నేర్పింది.. ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పింది.. కొత్త ఆహారపు అలవాట్లను నేర్పించింది. ఎప్పుడు బద్దకంగా ఫీల్ అయ్యేవారికి ఏదో ఒక పని చేసేలా చేసింది. కరోనా దెబ్బకు దేశమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దాంతో అందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఎక్కువ శాతం అన్ని పనులను ఇంట్లో నుంచే చక్కపెట్టుకున్నారు. ఎప్పుడు బయటకు వెళ్లి ఏదో పనిచేసేవారంతా నెలల తరబడి ఇంట్లోనే ఉండేసరికి చాలా బోర్ ఫీలయ్యారు.

అందులోనూ ఒంటరిగా ఉండేవారిలో బోర్ ఫీలింగ్ ఎక్కువగా ఉండేందంట.. అందుకే ఆ బోర్ ఫీలింగ్ పొగట్టుకునేందుకు స్నాక్స్ తినేయడం అలవాటు చేసుకున్నారంట.. లాక్ డౌన్ సమయంలో స్నాక్స్ తినడం అదేపనిగా పెట్టుకున్నారంట.. కరోనా మహమ్మారికి ముందు రోజుల కంటే ఎక్కువగా లాక్ డౌన్ లోనే అతిగా స్నాక్స్ బుక్కేశారంట.. 10మంది భారతీయుల్లో 9 మంది స్నాక్స్ తెగ తినేశారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది.

బోర్ ఫీలింగ్ పోయేందుకు దాదాపు 66 శాతం మంది భారతీయులు మీల్స్ కోసం స్నాక్స్ ఎక్కువగా తయారుచేసుకున్నారంట.. సర్వే ప్రకారం.. ప్రపంచ స్థాయిలో పోలిస్తే మనమే ఎక్కువగా స్నాక్స్ తినేశామంట.. మూడ్ మారేందుకు స్నాక్స్ తినడాన్ని ఎక్కువగా ఎంచుకున్నారంట. దాపు మూడింట రెండింతల మంది భారతీయులు ఒంటరితనం నుంచి బయటపడేందుకు స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారంట. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 6 నుంచి 20వ తేదివరకు 6,292 మందిపై Mondelez International, Harris Poll సంస్థలు గ్లోబల్ ఆన్ లైన్ సర్వే నిర్వహించాయి. అందులో భారతదేశం నుంచి 12 మార్కెట్లలో 508మందిపై కూడా సర్వే నిర్వహించారు.

లాక్ డౌన్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే భారతీయులు ఎక్కువగా కొత్త వంటలు ట్రై చేయడం, బేకింగ్, స్నాక్స్ తయారుచేసుకుని తినడం చేశారంట. నెలల తరబడి లాక్ డౌన్ అమల్లో ఉండటంతో చాలామందిలో ఆహారపు అలవాట్లను మార్చేసింది. అయితే ఆహార విక్రయాలు మాత్రం పడిపోయాయి.

మార్కెట్‌ రీసర్చర్‌ నీల్సన్‌ అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాదిలో జూన్‌ త్రైమాసికంలో స్నాక్స్‌, పానియాల అమ్మకాలు 25శాతం పడిపోయాయి. సెప్టెంబరు త్రైమాసికంలో 6.9శాతం మేర తగ్గాయి. అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన తర్వాత.. ప్రజలు మళ్లీ బయట ఆహారంపై ఆసక్తి చూపారు. ప్యాకింగ్ స్నాకులను కొనుగోలు చేశారు. సర్వే ప్రకారం.. 10మందిలో 8 మంది లేదా 81శాతం మంది భారతీయులు పెద్ద మొత్తంలో భోజనాల కంటే స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడ్డారని తేలింది.