IRCTC Offer for women : మహిళలకు IRCTC క్యాష్ బ్యాక్ ఆఫర్..

ఆగస్టు 22న రక్షాబంధన్ పండుగ. ఈ సందర్భంగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రక్ష బంధన్‌ను వేడుక సందర్భంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

IRCTC Offer for women : మహిళలకు IRCTC క్యాష్ బ్యాక్ ఆఫర్..

Irtc Offer For Womens

Updated On : August 13, 2021 / 1:15 PM IST

IRCTC Cash back Offer for women : ఆగస్టు 22న రక్షాబంధన్ పండుగ. ఈ సందర్భంగా భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రక్ష బంధన్‌ను వేడుక సందర్భంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే మహిళ ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ సమయంలో తేజస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు చార్జీలలో తగ్గింపు ఇస్తోంది. ఇది క్యాష్ బ్యాక్ రూపంలో తిరిగి వారికి చేరనుంది. రాబోయే పండుగలలో ప్రీమియం రైళ్ల ప్రయాణీకుల కోసం మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రారంభించాలని ఐఆర్‌సీటీసీ యోచిస్తోంది. కానీ అది ఏఏ రైళ్లలో అనేది త్వరలో చెప్పనుంది.

మహిళా ప్రయాణికులకు ఎన్నిసార్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుందంటే..
ఆగస్టు 15 నుండి ఆగష్టు 24 వరకు రెండు తేజస్ రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులందరికీ రక్షా బంధన్ సందర్భంగా 5 శాతం ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టుగా ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రకటించారు. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చిన కాలంలో చేసిన ప్రయాణానికి మాత్రమే ఇది వర్తిస్తుందనే విషయాన్ని గమనించాలి.

ఈ ఆఫర్ ఉన్నకాలంలో మహిళలు ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. క్యాష్ బ్యాక్ అమౌంట్.. టిక్కెట్లు బుక్ చేసుకున్న అనంతరం వారి ఖాతాలోకి జమ అవుతుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ సమయానికి గాను ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న మహిళా ప్రయాణీకులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో మహిళలు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ప్రకటించారు.

తేజస్ ఎక్స్‌ప్రెస్.. లక్నో-ఢిల్లీ-లక్నో (రైలు నెం. 82501/02), అహ్మదాబాద్-ముంబై-అహ్మదాబాద్ (రైలు నంబర్ 82901/02) మార్గాల్లో నడుస్తున్నాయి. ప్రయాణీకులందరి ఆరోగ్యం, భద్రతా నిబంధనలను అనుసరించి.. ఈ రెండు రైళ్లు ఆగస్టు 7 న కరోనా నిబంధనలను పాటిస్తూ తిరిగి ప్రారంభమయ్యాయి. ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం వారానికి నాలుగు రోజులు అంటే.. శుక్రవారం, శని, ఆది, సోమవారం ఈ రెండు తేజస్ రైళ్లను నడుపుతోంది.

మహిళలకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన సందర్భంగా..ఐఆర్‌సిటిసి చీఫ్ రీజనల్ మేనేజర్ (సిఆర్‌ఎం) అజిత్ కుమార్ సిన్హా మాట్లాడుతూ..తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని తెలిపారు. IRCTC మహిళా ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక ఆఫర్ ప్రకటించిందనీ..ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఆగస్టు 15 నుండి 24 వరకు చెల్లుతుందని కాబట్టి మహిళలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.