IRCTC: 200కిపైగా రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.. మనీ రీఫండ్ చేస్తామని వెల్లడి

దేశవ్యాప్తంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. మొత్తం 230కిపైగా రైళ్లను రద్దు చేసింది. వీటిలో 180 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మిగతా రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.

IRCTC: 200కిపైగా రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.. మనీ రీఫండ్ చేస్తామని వెల్లడి

Updated On : December 1, 2022 / 8:46 AM IST

IRCTC: భారతీయ రైల్వే శాఖ గురువారం భారీ స్థాయిలో రైళ్లను రద్దు చేసింది. ఈ ఒక్క రోజే దేశవ్యాప్తంగా 200కుపైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరమ్మతులు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన పనులు సాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

Karnataka: 205 కేజీల ఉల్లిపాయల్ని 8 రూపాయలకే అమ్మిన రైతు.. వైరల్ అవుతున్న రశీదు

180 రైళ్లు పూర్తిగా, 50 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. దీనికి సంబంధించిన సమాచారాన్నిప్రయాణికులకు తెలిపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి ఆటోమేటిగ్గా టిక్కెట్లు క్యాన్సిల్ అవుతాయని, వారి అకౌంట్లోకి మనీ రీఫండ్ చేస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుని, మనీ రీఫండ్ పొందవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఇంతకుముందు బుధవారం కూడా ఐఆర్‌సీటీసీ పలు రైళ్లను రద్దు చేసింది. ఏయే రైళ్లు రద్దయ్యాయో తెలుసుకోవాలి అనుకుంటే రైల్వే శాఖ వెబ్‌సైట్ సందర్శించాలని ప్రయాణికులకు సూచించింది.