Ram Pothineni : ‘ఇస్మార్ట్ శంకర్’ ఇరగదీస్తుండు..!

‘ఇస్మార్ట్ శంకర్‌’ హిందీ డబ్బింగ్ వెర్షన్ 200 మిలియన్లు (20 కోట్లు) మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది..

Ram Pothineni : ‘ఇస్మార్ట్ శంకర్’ ఇరగదీస్తుండు..!

Ismart Shankar

Updated On : May 31, 2021 / 5:53 PM IST

iSmart Shankar: ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని, డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్‌’ సోషల్ మీడియాలో ఇంకా హవా కొనసాగిస్తోంది. 2019 జూలై 18న విడుదలైన ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది..

తాజాగా ఉస్తాద్ ‘ఇస్మార్ట్ శంకర్‌’ హిందీ డబ్బింగ్ వెర్షన్ 200 మిలియన్లు (20 కోట్లు) మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.. 2020 ఫిబ్రవరి 16న ఇస్మార్ట్ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 19 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.

యూట్యూబ్‌లో డబ్బింగ్‌ సినిమాల ద్వారా భారీ వ్యూస్ తెచ్చుకోవడం రామ్ సినిమాలకిది నాలుగోసారి.. హాట్ బ్యూటీస్ నభా నటేష్, నిధి అగర్వాల్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్, పూరి జగన్నాథ్ ఇద్దరికీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమాగా వారి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ‘ఇస్మార్ట్ శంకర్’ 200 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేయడంతో రామ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో #20CrViewsForiSmartShankar పేరుతో ట్రెండ్ చేస్తున్నారు..