Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగ్‌దీప్ ధన్‌కర్

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా ఎన్నికైన దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము జగ్‌దీప్ ధన్‌కర్‌చే ప్రమాణం చేయించారు.

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన జగ్‌దీప్ ధన్‌కర్

Jagdeep Dhankhar

Updated On : August 11, 2022 / 2:11 PM IST

Jagdeep Dhankhar: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నూతనంగా ఎన్నికైన దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము జగ్‌దీప్ ధన్‌కర్‌చే ప్రమాణం చేయించారు. నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

Jagdeep Dhankhar: నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

ధన్‌కర్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను తన ట్వీటర్ ఖాతాలో ధన్ కర్ పోస్టు చేశారు.

ఉపరాష్ట్ర పతిగా బాధ్యతలు స్వీకరించిన జగ్‌దీప్ ధన్‌కర్ అంతకుముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగి విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా పై 346 ఓట్ల తేడాతో జగ్‌దీప్ ధన్‌కర్ విజయం సాధించారు.