JEE Main 2022: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు రేపటి (జూలై 21) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. బుధవారం జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది.

Jee Mains
JEE Main 2022: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలు రేపటి (జూలై 21) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. బుధవారం జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం ప్రకటించింది. పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ను ప్రకారం పరీక్షలు జరుగుతాయని తెలిపింది. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. 21 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. ఆ తేదీలు వాయిదా పడటంతో నూతన షెడ్యూల్ ప్రకారం.. జూలై 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని ఎన్టీఏ వెల్లడించింది.
JEE Main : రెండు విడతల్లో జేఈఈ మెయిన్స్
JEE మెయిన్ 2022 సెషన్-2 పరీక్షకు 6,29,778 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జూలై 25 నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు దేశం వెలుపల 17 నగరాలతో సహా దేశంలోని దాదాపు 500 నగరాల్లో అభ్యర్థులు హాజరవుతారు. JEE మెయిన్ 2022 జూలై సెషన్ అడ్మిట్ కార్డ్ రేపటి (జూలై 21) నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఎన్‌టీఏ తెలిపింది. JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి దరఖాస్తుదారులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం
JEE మెయిన్ జూలై పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు అప్లికేషన్ నంబర్‌లు, పుట్టిన తేదీలను ఉపయోగించాల్సి ఉంటుంది. JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి పూరించాల్సిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ కూడా ఉంటుంది. NTA JEE మెయిన్ 2022 సెషన్ 2 అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, దరఖాస్తుదారులు తమ పేరు, ఫోటో, JEE మెయిన్ 2022 దరఖాస్తు ఫారమ్ నంబర్‌తో సహా ఇతర వ్యక్తిగత వివరాలు సరైనవో కాదో తనిఖీ చేయాలి. ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే, JEE మెయిన్ దరఖాస్తుదారులు తప్పనిసరిగా NTAని సంప్రదించి తద్వారా JEE మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డ్‌లోని లోపాలను సరిదిద్దుకోవాలి.
ఇదిలా ఉంటే పరీక్ష వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగాయి. ఫలితాలు జూలై 11న ప్రకటించిన విషయం విధితమే.