Iti Limited Bangalore : ఐటిఐ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ…దరఖాస్తులకు ఆఖరు తేదీ ఎప్పుడంటే…

భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను పరిశీలిస్తే మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Iti Limited Bangalore : ఐటిఐ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ…దరఖాస్తులకు ఆఖరు తేదీ ఎప్పుడంటే…

Iit (1)

Updated On : July 21, 2021 / 11:51 AM IST

Iti Limited Bangalore : బెంగుళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఐటీఐ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. సంస్ధకు చెందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులతోపాటు మరికొన్ని టెక్నికల్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీరకరణ గడువు జులై 22తో ముగుస్తుంది.

భర్తీ చేయనున్న ఖాళీల వివరాలను పరిశీలిస్తే మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో స్టాఫ్ నర్సు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఎక్సరే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ ఫార్మసిస్ట్ , రిసెప్ఫనిస్ట్, హెల్పర్ తదిర పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు దగ్గట్టుగా విద్యార్హతలను నిర్ణయించారు. విభాగాల వారీగా ఏడో తరగతి , పదవతరగతి, సంబంధింత రంగంలో డిప్లోమా, బీ ఫార్మసీ ఉత్తీర్ణత సాధించి ఉండటంతోపాటుగా పని అనుభవాన్ని కలిగి ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 30ఏళ్ళ మించరాదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి హార్ట్ కాపీలను ఆప్ లైన్ ద్వారా బెంగుళూరులోని సంస్ధ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. హార్ట్ కాపీలను జులై 24వ తేదీలోపు ఏజీఎం..హెచ్ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగుళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగుళూరు 560016 అడ్రస్ కు పంపించాలి. అప్టిట్యూడ్, టెక్నికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.