Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్

ఆరోగ్యాన్నిచ్చే యోగాను, ఆయుర్వేదాన్ని ఒక మతం, వర్గానికి పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘వన్ నేషన్-వన్ హెల్త్ సిస్టమ్’ పేరుతో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్

Ram Nath Kovind

Updated On : May 28, 2022 / 4:13 PM IST

Ram Nath Kovind: ఆరోగ్యాన్నిచ్చే యోగాను, ఆయుర్వేదాన్ని ఒక మతం, వర్గానికి పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ‘వన్ నేషన్-వన్ హెల్త్ సిస్టమ్’ పేరుతో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య రంగానికి చెందిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ‘‘యోగాను, ఆయుర్వేదాన్ని ఒక మతం, వర్గానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.

Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి

ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామం, పట్టణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని ద్వారా దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. 2017లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘నేషనల్ హెల్త్ పాలసీ’ ద్వారా వైద్య సేవలు తక్కువ ధరలోనే అందుతాయి. రెండేళ్లుగా ప్రపంచం కోవిడ్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటంలో వైద్యులు, శాస్త్రవేత్తల సేవలు అభినందనీయం. వాళ్లకు నా శుభాకాంక్షలు’’ అని రామ్‌నాథ్ వ్యాఖ్యానించారు. భోపాల్‌లో పది వైద్య సంస్థల బిల్డింగుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.