Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..

ఓ ఆడసింహం టాయిలెట్ లోకి వెళ్లి బయటకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది.

Lion In Toilet : జెంట్స్ టాయిలెట్ లోంచి బయటకొస్తున్న ఆడ సింహం..ఇదేం సిగ్గురా బాబూ అంటున్న జనాలు..

Lion Walks Out Of Public Gents Toilet

Updated On : October 4, 2021 / 4:27 PM IST

Lion In Toilet Coming From Public Toilet : మనుషుల కంటే జంతువులే నయం అని జర్మనీలో ఆవులు టాయిలెట్లు వాడుతున్న విషయం చూసి అనుకుంటాం. .జర్మనీలో ఆవులు టాయిలెట్ కు వెళ్లి మూత్రం పోసుకుని వస్తున్నాయి. వాటిని చూస్తే మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తుంది. కానీ ఓ సింహం టాయిలెట్ కు వెళ్లిరావటం పైగా అది జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్లి వచ్చింది. మరి అది టాయిలెట్ పోసుకోవటానికి వెళ్లిందో ఏమోగానీ ఓ పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లి బయటకు వస్తున్న సింహం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింహం ఏంటి.. టాయిలెట్ ను ఉపయోగించడం ఏంటి అంటారా? అదే విచిత్రం.

Read more : Cows toilet : టాయిలెట్‌ వాడుతున్న ఆవులు..మనుషుల కంటే జంతువులే నయమనిస్తున్నాయి.

ఈ వీడియోలో ఓ సింహం టాయిలెట్ లోకి వెళ్లి బయటకు వస్తు కనిపిస్తుంది. అలా బయటకు వచ్చిన సింహం ‘ఇది నాకు మామూలే’ అన్నట్లుగా ఆ మృగరాజు తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. పబ్లిక్ టాయిలెట్ నుంచి ఎంతో దర్జాగా వస్తున్న సింహాన్ని చూస్తే నిజంగా షాక్ అవుతాం. వామ్మో.. ఈ మధ్య పబ్లిక్ టాయిలెట్స్ లో సింహాలు కూడా తిరుగుతున్నాయా? ఇంకో పబ్లిక్ టాయిలెట్ వంక చూసేదే లేదంటున్నారు.

పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటికి వస్తున్న ఆ సింహం వీడియోను వైల్డ్ లెన్స్ ఈకో ఫౌండేషన్ అనే సంస్థ తమ ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పోస్ట్ చేసింది. బాత్ రూమ్ కూడా ఎప్పటికీ సేఫ్ కాదు. ఎప్పుడూ మనుషులేనా.. అప్పుడప్పుడు ఇలాంటి జంతువులు కూడా ఉపయోగించుకుంటాయి.. అంటూ క్యాప్షన్ పెట్టారు.

Read more : Butter Chicken Golgappe : బ‌ట‌ర్ చికెన్ గోల్‌గ‌ప్ప.. నెట్టింట్లో రచ్చ

కాకపోతే ఇది ఎక్కడ జరిగిందో తెలియదుగానీ..నెటిజన్లు మాత్రం ఈ వీడియోను చూసి బాబోయ్ ఇంకెప్పుడు పబ్లిక్ టాయిలెట్ కి వెళ్లకూడదు అనుకుంటున్నారు. మరి ఆ సింహానికి సిగ్గె కాస్త ఎక్కువేమో టాయిలెట్ లోపలికివెళ్లి వచ్చింది. మరి అంత సిగ్గు అయితే ఆడసింహం..టాయిలెట్ కు వెళ్లాలంటే లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లకుండా ఇలా జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్లటమేంటో..అంటున్నారు ఫన్నీ నెటిజన్లు. మరికొంతమంది ఒక ఆడ సింహం అయి ఉండి.. జెంట్స్ టాయిలెట్ ను యూజ్ చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు బుద్ధికలిగిన సింహం’ అంటున్నారు. మరికొందరు ఇంకా ఫన్నీగా..అబ్బా ఇప్పటివరకు ఓపిక పట్టాను టాయిలెట్ కు వెళ్లటానికి ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ అంటున్నారు. ఇలా ఈ టాయిలెట్ కు వెళ్లొచ్చిన సింహం వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.