Lok Sabha: లోక్‌స‌భ స్పీక‌ర్ నేతృత్వంలో అఖిల‌ప‌క్ష భేటీ.. టీఆర్ఎస్ గైర్హాజ‌రు

లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఓం బిర్లా ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు. పార్ల‌మెంటు స‌మావేశాల సన్నాహాల వంటి అంశాల‌పై ఆయ‌న వివ‌రిస్తున్నారు. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఈ స‌మావేశానికి వైసీపీ నుంచి మిధున్ రెడ్డి హాజ‌ర‌య్యారు

Lok Sabha: లోక్‌స‌భ స్పీక‌ర్ నేతృత్వంలో అఖిల‌ప‌క్ష భేటీ.. టీఆర్ఎస్ గైర్హాజ‌రు

Om Birla

Updated On : July 16, 2022 / 5:23 PM IST

Lok Sabha: లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా నేతృత్వంలో అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రుగుతోంది. ఈ నెల 18 నుంచి పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఓం బిర్లా ఈ స‌మావేశం ఏర్పాటు చేశారు. పార్ల‌మెంటు స‌మావేశాల సన్నాహాల వంటి అంశాల‌పై ఆయ‌న వివ‌రిస్తున్నారు. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. ఈ స‌మావేశానికి వైసీపీ నుంచి మిధున్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

Maharashtra: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు.. ‘మ‌హా’ కేబినెట్ కీల‌క‌ నిర్ణయాలు

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చైధురి, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ప్ర‌హ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆర్ఎల్జేపీ ఎంపీ ప‌శుప‌తి కుమార్, ఇత‌ర పార్టీల ఎంపీలు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. దేశంలో పెరిగిపోయిన ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, రూపాయి మార‌క‌ విలువ ప‌త‌నం, దేశంలో మ‌త క‌ల‌హాలు వంటి అంశాల‌పై కేంద్ర ప్ర‌భుత్వాన్ని విప‌క్ష పార్టీలు నిల‌దీయ‌నున్నాయి.