14 నెలల చిన్నారికి భయంకర జబ్బు..లాటరీ తగలటంతో నిలిచిన పసిప్రాణాలు

lottery saves Bhatkal 14months baby life : 14 నెలల పసిబిడ్డకు భయంకరమైన జబ్బు వచ్చిపడింది. చిట్టిపాదాలతో బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా సందడి చేయాల్సిన పాప ముక్కులో పైపు పెట్టుకుని క్షణమొక యుగంలో బతకాల్సి వస్తోంది. కన్నబిడ్డను అలా చూస్తున్న తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు..ఆ బాధను గురించి చెప్పటానికి మాటలు చాలవు.
సాధ్యమైనంత వరకూ తమ బిడ్డను బతికించుకోవటానికి కన్నవారు పడిన కష్టం అంతా ఇంతా కాదు. మధ్యతరగతి కుటుంబం అయినా తమ శక్తికి మించి వైద్యం చేయించారు. కానీ పాప ఆరోగ్యం కుదుట పడాలంటే కోట్ల రూపాలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారికి సాక్షాత్తూ దేవుడే కరుణించాడా? అన్నట్లుగా ఓ ‘లాటరీ’ వారి జీవితాల్లో వెలుగులు నింపింది. పాప ప్రాణాలను ఓ లాటరీ కాపాడింది. ఇదేదో సినిమా కథలా ఉన్న పాప ప్రాణాల్ని కాపాడిన నిత్యసత్యం..
కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన ఓ జంటకు ఒక 14నెలల పాప ఉంది. ఆ పసిపాపకు స్పైనల్ మస్కులర్ అట్రాఫీ(ఎస్‌ఎమ్‌ఏ) అనే అరుదైన వ్యాధి సోకింది. ఇది చిన్నారుల పిల్లల సామర్థ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు నడవడానికి, నిలబడడానికి, కూర్చోడానికి, తినడానికి, శ్వాస తీసుకోవడానికి, ఇంకా మింగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.
దీనికి ట్రీట్ మెంట్ చాలా చాలా కష్టం. అయినా సరే పాపను బతికించుకోవటానికి కన్నవారు నానా పాట్లు పడుతున్నారు. 16కోట్ల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పటంతో షాక్ అయ్యారు. ఇక తమ బిడ్డమీద ఆశలు వదిలేసుకువాలా? అనే మానసిక వేదనతో అల్లాడిపోతున్నారు.
అయితే వీరి వేదనను చూసి దేవుడి మనసు కూడా కరిగిందేమో..ఈ జంటకు ఓ లాటరీ తగిలేలా చేశాడు. ప్రముఖ డ్రగ్ తయారీ సంస్థ నోవార్టిస్.. ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రామ్‌లో ఈ జంట లక్కీ విన్నర్‌గా నిలిచింది. దీంతో సదరు సంస్థ వీళ్ల 14నెలల ఫాతిమాకు అవసరమైన జాల్గెస్మా థెరపీ చికిత్సను ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చింది. చెప్పినట్లుగానే పాప ప్రాణాలు నిలిబెట్టారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందం అంబరాన్ని అంటింది…