Police harassing girls : బాలికను వేధిస్తూ కెమెరాకి చిక్కిన లక్నో పోలీస్.. రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఇలా….

ఎవరితో అయినా సమస్య వస్తే పోలీసులకు చెప్పి రక్షణ కోరతాం. పోలీసే పట్టపగలు వెంటబడి వేధిస్తుంటే? లక్నోలో ఓ పోలీస్ బాలిక వెంటపడి వేధిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోలీసు తీరుపై జనం మండిపడుతున్నారు.

Police harassing girls : బాలికను వేధిస్తూ కెమెరాకి చిక్కిన లక్నో పోలీస్.. రక్షణ కల్పించాల్సిన పోలీస్ ఇలా….

Police harassing girls

Police harassing girls: ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ వారినే వేధిస్తే? లక్నోలో ఇదే జరిగింది. స్కూల్‌కి వెళ్తున్న విద్యార్ధిని వెంటపడి వేధిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు సస్పెండ్ చేశారు. ప్రతిరోజు అనేక చోట్ల ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. వారికోసం ఎన్ని చట్టాలు చేసినా అవి న్యాయం చేయలేకపోతున్నాయి. న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం ఆడపిల్లల్ని వేధిస్తే? అదీ స్కూల్ విద్యార్ధిని వెంట పడి ఇబ్బంది పెడితే?

Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం .. స్టేషన్‌లోనే ఖైదీలతో కలిసి పోలీసుల మందు పార్టీ

లక్నోలో షాహదత్ అలీ అనే హెడ్ కానిస్టేబుల్ సైకిల్ మీద స్కూల్‌కి వెళ్తున్న విద్యార్ధినిని బైక్‌తో బడించాడు. ఆమెను ఫాలో అవుతూ వేధిస్తుండగా ఓ మహిళ వీడియో తీసింది. ఎందుకు విద్యార్ధిని వెంట పడుతున్నావని మహిళ ప్రశ్నించడంతో నీళ్లు నమిలాడు.

 

ప్రతిరోజు ఆ ప్రాంతంలో అమ్మాయిలను వెంబడించి వేధిస్తున్నాడని వీడియో తీసిన మహిళ ఆరోపిస్తోంది. ఈ ఉదంతం అంతా వీడియో ద్వారా ట్విట్టర్‌లో షేర్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు షాహదత్ అలీని సస్పెండ్ చేశారు. మరోవైపు అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.

HCU Prof Ravi Ranjan Suspend: థాయ్‌లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం .. HCU ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్

ఈ విషయంపై స్పందించిన లక్నో సెంట్రల్ డీసీపీ అపర్ణ కౌశిక్ తక్షణమే అతనిని సస్పెండ్ చేశామని.. అతనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

UP police constable 'Shahadat Khan' was arrested and FIR was lodged under molestation and #pocsoact