Man Assault Woman : దారుణం.. పెళ్లి చేసుకుంటానని.. యువతిపై లైంగిక దాడి

ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. మాయమాటలతో నమ్మించి వారి గొంతు కోస్తున్నారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.

Man Assault Woman : దారుణం.. పెళ్లి చేసుకుంటానని.. యువతిపై లైంగిక దాడి

Man Assault Woman

Updated On : November 28, 2021 / 6:50 PM IST

Man Assault Woman : ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. మాయమాటలతో నమ్మించి వారి గొంతు కోస్తున్నారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి తమ అసలు రూపం బయటపెడ్తున్నారు. మోసం అని తెలిసేలోపు ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన యువకుడు యువతిపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడు.

Fridge : ఫ్రిజ్‌లో… ఆ.. ఆహార పదార్థాలను ఉంచకపోవటమే మేలు.. ఎందుకంటే?

పోరంకి సాలిపేటకు చెందిన యువతి (24)ను టెన్త్‌లో క్లాస్‌మెట్‌ అయిన అదే గ్రామానికి చెందిన కోలా బలరామ్‌ కల్యాణ్‌ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. యువతి తొలుత నిరాకరించింది. అయినప్పటికీ అతడు వెంటపడ్డాడు. అంతేకాదు తనను ప్రేమించకపోతే చనిపోతానని అన్నాడు. దీంతో అతడి మాటలు నమ్మిన యువతి అతని ప్రేమను అంగీకరించింది.

Omicron : భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.. 8 దేశాల్లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు

ఇదే అదనుగా ఆ యువకుడు ఆమెపై పలుసార్లు లెంగిక దాడి చేశాడు. ఇంతలో యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. అయితే ఆమెకు ఊహించని షాక్ తగిలింది. యువకుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. యువకుడిపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.