Kapra Man Dies With Heart Attack : షాకింగ్.. స్వాతంత్ర్యం గురించి స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో దుర్మరణం.. వీడియో

వంపుగూడలోని లక్ష్మీ విల్లాస్ లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఓ వ్యక్తి హఠాన్మరణం చెందారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఉప్పల సురేశ్ అనే వ్యక్తి స్వాతంత్ర్యం గురించి స్పీచ్ ఇస్తున్నారు. ఆయన మైక్ తీసుకుని స్వాతంత్ర్యం ముందు నాటి విశేషాల గురించి కాలనీ వాసులకు చెబుతున్నారు. ఇంతలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే.. అలాగే కుప్పకూలిపోయారు. ప్రాణాలు వదిలారు.

Kapra Man Dies With Heart Attack : షాకింగ్.. స్వాతంత్ర్యం గురించి స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో దుర్మరణం.. వీడియో

Updated On : August 15, 2022 / 4:59 PM IST

Kapra Man Dies With Heart Attack : దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాల సందడి నెలకొంది. ప్రతి చోటా జాతీయ జెండాను ఎగరేసి తమ దేశ భక్తిని చాటుకుంటున్నారు పౌరులు. ఎటు చూసినా మువ్వన్నెల పతాకం రెపరెపలే. ఇది ఇలా ఉంటే స్వాతంత్ర్య దినోత్సవాల వేళ మేడ్చల్ జిల్లా కాప్రాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

వంపుగూడలోని లక్ష్మీ విల్లాస్ లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో ఓ వ్యక్తి హఠాన్మరణం చెందారు. జెండా ఆవిష్కరణ తర్వాత ఉప్పల సురేశ్ అనే వ్యక్తి స్వాతంత్ర్యం గురించి స్పీచ్ ఇస్తున్నారు. ఆయన మైక్ తీసుకుని స్వాతంత్ర్యం ముందు నాటి విశేషాల గురించి కాలనీ వాసులకు చెబుతున్నారు. ఇంతలో ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే.. అలాగే కుప్పకూలిపోయారు. ప్రాణాలు వదిలారు.

ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. అంతా చూస్తుండగానే సురేశ్ అలానే కుప్పకూలడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలేం జరిగిందో అర్థమయ్యేలోపే సురేశ్ కన్నుమూశారు. సురేశ్ మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. మృతుడు సురేశ్ బాగ్ అంబర్ పేట్ డీడీ కాలనీలోని ఓ ఫార్మా ఏజెన్సీలో పని చేస్తున్నారు. కాగా, తన కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో సురేశ్ తండ్రి యాదగిరి కన్నీటిపర్యంతం అయ్యారు.