Viral Video: ఓరి వీడి వేషాలో.. మెట్రోలో సీటు కోసం ఏం చేశాడంటే?

చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళమంటే కొందరు చాలా రకాల డ్రామాలు మొదలుపెట్టి చివరికి పేరెంట్స్ చేతనే వద్దులే ఇంట్లోనే ఉండు అనేలా చేస్తుంటారు. మరి కొందరు పెద్దవాళ్ళు కూడా బస్సులు, ట్రైన్లలో సీట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్తుంటారు. కానీ ఓ యువకుడైతే మెట్రోలో సీట్ కోసం ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు.

Viral Video: ఓరి వీడి వేషాలో.. మెట్రోలో సీటు కోసం ఏం చేశాడంటే?

Man Do Acting For Get Seat Crowded Metro Viral

Updated On : June 14, 2021 / 7:30 PM IST

Viral Video: చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళమంటే కొందరు చాలా రకాల డ్రామాలు మొదలుపెట్టి చివరికి పేరెంట్స్ చేతనే వద్దులే ఇంట్లోనే ఉండు అనేలా చేస్తుంటారు. మరి కొందరు పెద్దవాళ్ళు కూడా బస్సులు, ట్రైన్లలో సీట్ల కోసం ఎన్నో అబద్దాలు చెప్తుంటారు. కానీ ఓ యువకుడైతే మెట్రోలో సీట్ కోసం ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు. తనకేదో ఫిట్స్ వచ్చినట్లు.. కరెంట్ షాక్ కొట్టినట్లు గిలగిలా కొట్టుకున్నాడు. అది నిజమే అని నమ్మిన ఓ యువతి లేచి సీటిచ్చింది.

కానీ ఆ యువకుడు సీట్లో కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ అలానే ప్రవర్తించాడు. దీంతో మిగతా ప్రయాణికులకు అనుమానం వచ్చింది. ఇది కేవలం సీటు కోసం ఆ యువకుడు ఆడిన నాటకంలా కనిపించింది. ఈ తతంగమంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూస్తే ఇది కావాలనే చేసి వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనిపిస్తుంది.

ఇది ఎక్కడ జరిగిందో ఎవరికి తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ యువకుడిపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. జస్ట్ సీటు కోసం ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేసిన ఈ యువకుడిని హాలీవుడ్ కి పంపాలని కొందరు అంటుంటే.. ఫ్రాంక్ వీడియోల కోసం ఇలా చేసే వారిని పోలీసు కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Tube indian ??? (@tube.indian)