పూలు చల్లి..మద్యం ప్రియులకు ఘన స్వాగతం

  • Published By: madhu ,Published On : May 5, 2020 / 05:40 AM IST
పూలు చల్లి..మద్యం ప్రియులకు ఘన స్వాగతం

Updated On : May 5, 2020 / 5:40 AM IST

మందుబాబులు వెల్ కం…స్వాగతం..సుస్వాగతం…అంటూ ఓ వ్యక్తి పూలు చల్లడంతో అందరూ షాక్ కు తిన్నారు. ఏంటీ ఇలా చేస్తున్నాడేంటీ ? అంటూ ఆశ్చర్యపోయారు. మందు బాటిళ్ల కోసం క్యూలో నిలబడిన వారి తలలపై పూలు చల్లుతూ..వెళ్లాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. 

కరోనా లాక్ డౌన్ 3.0 కొనసాగుతోంది. ఈ క్రమంలోనే…కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. అందులో కీలకమైంది మద్యం విక్రయాలు. 2020, మే 04వ తేదీ నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత తెరుచుకోవడంపై మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ఢిల్లీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు షాపులు తెరుస్తున్నారు. మే 05వ తేదీ ఉదయాన్నే ఢిల్లీలోని వైన్స్ షాపుల ఎదుట క్యూ కట్టారు. చందర్ నగర్ లో ఓ మద్యం షాపు ఎదుట భారీగానే బారులు తీరారు. 

ఇంతలో ఓ వ్యక్తి వచ్చి..క్యూలో నిలుచున్న వారిపై పూలు చల్లాడు. ఓ కవర్ లో తెచ్చుకున్న పూలను వారి తలలపై చల్లుతూ వెళ్లాడు. దేశానికి ఆర్థిక వనరులు మీరే..ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని వెల్లడించాడు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా..క్యూలో నిలుస్తున్నారు. 

ఢిల్లీలో సోమవారం లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కనీసం ఆరు అడుగుల దూరం నిలబడాలని, కొన్ని నిబంధనలు విధించింది కేంద్రం. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటించలేదు. మద్యం అమ్మకాలతో అధిక ఆదాయం సంపాదించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రేట్లను పెంచుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కరోనా సెస్ విధించనుంది. కరోనా ఫీ పేరిట ఏకంగా 70 శాతం సుంకం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి మద్యం ధరలు పెరగనున్నాయి. 
 

Also Read | లిక్కర్ షాపుకు కొబ్బరి కాయ కొట్టి…పూజలు