Chitrapuri Colony : చిత్రపురి కోవిడ్ బాధితులకు అండగా ‘‘మనం సైతం’’..

చిత్రపురి కాలనీలో కోవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ మానస పుత్రిక ‘‘మనం సైతం’’..

Chitrapuri Colony : చిత్రపురి కోవిడ్ బాధితులకు అండగా ‘‘మనం సైతం’’..

Manam Saitham Team Helps To Chitrapuri Colony Covid Patients

Updated On : May 27, 2021 / 5:47 PM IST

Chitrapuri Colony: చిత్రపురి కాలనీలో కోవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ మానస పుత్రిక ‘‘మనం సైతం’’.. ఈ సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ప్రతి రోజూ ఆహారం, ఆక్సిజెన్ సిలిండర్లు, ఆక్సిజెన్ కాన్సెన్ట్రేటర్, మందుల కిట్, PPE కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్, ఇమ్మ్యూనిటీ పొడి, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆక్సీమీటర్‌లు, థర్మామీటర్లు, ఇంజెక్షన్లు అందిస్తున్నారు..

ఉదయం నుంచే మొదలయ్యే ఈ సేవా కార్యక్రమాలు రాత్రి దాకా కొనసాగుతున్నాయి. బాధితుల అవసరాలు తెలుసుకుని, మనం సైతం టీమ్ తక్షణమే స్పందించి వారికి సహాయం అందిస్తోంది. ఆరోగ్యకరమైన భోజనాలను ప్యాక్ చేసి బాధితుల వద్దకు వెళ్లి అందజేస్తున్నారు. మనం సైతం అందిస్తున్న మందులు, ఆహారం, ఆక్సిజన్‌‌తో త్వరగా కోలుకుంటామనే ధైర్యం కొవిడ్ బాధితుల్లో కనిపిస్తోంది..

Manam Saitham

ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘చిత్రపురి కాలనీ కరోనా బాధితులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. మనం సైతం తరుపున ఆహారం, ఆక్సిజెన్ సిలిండర్లు, ఆక్సిజెన్ కాన్సెన్ట్రేటర్, మందుల కిట్, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్, ఇమ్మ్యూనిటి పొడి, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆక్సీమీటర్‌లు, థర్మా మీటర్లు, ఇంజెక్షన్లు అందజేస్తున్నాం. ఈ కష్టకాలంలో మా చిత్రపురి వాసులకు అండగా నిలబడటం సంతృప్తిగా ఉంది. వారు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా సంతోషంగా కాలనీలో ఉండటమే మాకు కావాల్సింది. అప్పుడే మా సేవకు నిజమైన ఫలితం దక్కింది అనుకుంటాం. అవసరంలో ఉన్నవారి కోసం ఎప్పుడైనా ఎక్కడికైనా సిద్ధం’’.. అన్నారు.

కాదంబరి కిరణ్ సారథిలా నడిపిస్తున్న ఈ సేవా వాహినికి వల్లభనేని అనిల్ కుమార్, అనిత నిమ్మగడ్డ, రుద్రరాజు రమేష్, సీసీ శ్రీను, రమేష్ రాజా, నాగరాజు, ప్రభాకర్, అంజలి, మీనా, సురేష్, చిల్లర వేణు, అంజలి, జయ, హరిత, కృష్ణ శివయ్య అండ్ టీం తదితరులు తమ పూర్తి సహకారం అందిస్తున్నారు..

Kadambari Kiran