MAA Elections: ‘మా’ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. ఎన్నికల అధికారికి విష్ణు లేఖ..!
ఈ నెల 10 న జరగనున్న మా.. ఎన్నికలను.. బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని ఎలక్షన్స్ అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు.

Manchuvishnu
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం.. క్షణానికో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే… పోస్టల్ బ్యాలెట్ల విషయంపై.. మా ఎన్నికల అధికారిని కలిసిన ప్రకాష్ రాజ్.. ప్రత్యర్థి ప్యానెల్‌పై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. కొందరి తరఫున మంచు విష్ణు మేనేజర్ డబ్బులు కట్టారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వివాదం వేడి చల్లారకముందే.. మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి లేఖ రాశారు.
Also read: MAA Elections : ‘మా’లో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ మధ్యలో మెగాస్టార్..
ఈ నెల 10 న జరగనున్న మా.. ఎన్నికలను.. బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కోరారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వాటిపై తమ ప్యానెల్‌కు నమ్మకం లేదన్న విష్ణు.. పేపర్ బ్యాలెట్ విధానంలోనే పోలింగ్ నిర్వహించాలన్నారు.
Also read: Balakrishna : బాలయ్య ఓటు కూడా నాకే : మంచు విష్ణు
ఈ విధానంలో.. సీనియర్లు చాలా మంది ఓటు వేసే అవకాశం ఉంటుందని లేఖలో చెప్పారు. మరోవైపు.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మాత్రం ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించాలంటోంది. ఈ విషయంలో.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల అధికారి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Also read: Prakash Raj: మంచు విష్ణుపై “మా” అధికారికి ఫిర్యాదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్!