గూగుల్ సెర్చ్ కొత్త హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. సెర్చ్ అండ్ అసిస్టెంట్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్‌ను నియమించింది. ఇప్పటివరకూ ఈ విధులను నిర్వర్తించిన Ben Gomes ను సంస్థలోని మరో కొత్త రోల్ కు మార్చింది. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కు రిపోర్టు చేయాల్సిందిగా గూగుల్ సంస్థ సూచించింది. ఈ విషయాన్ని Search Engine Land ముందుగా రిపోర్టు చేసింది. 2012 నుంచి రాఘవన్ గూగుల్ సంస్థలో పనిచేస్తున్నారు. 2018 ప్రారంభంలో రాఘవన్.. గూగుల్ అడ్వైర్టైజ్ మెంట్స్ అండ్ కామర్స్ బిజినెస్ హెడ్ గా నియమితులయ్యారు. ఇందులో సూపర్ విజన్ సెర్చ్ డిస్ ప్లేతో పాటు వీడియో అడ్వర్టైజింగ్ అనాలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వంటి వ్యవహారాలను కూడా రాఘవన్ చూసుకున్నారు.
గూగుల్ సంస్థలో advertising and commerce business హెడ్ కాకముందు ఆయన గూగుల్ యాప్స్ వైస్ ప్రెసిడెంట్ గానూ గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ కూడా పనిచేశారు. గూగుల్ లో చేరక ముందు రాఘవన్ IBM వంటి టెక్ కంగోలోమెరేట్స్, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహూలోనూ విభిన్న రోల్స్ లో పనిచేశారు. గూగుల్ లో చేరిన తర్వాత రాఘవన్.. ఒక బిలియన్ మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్న జీమెయిల్, గూగుల్ డ్రైవ్ అభివృద్ధి కోసం కృషి చేశారు.
G Suite, Smart Replay, Smart Compose, Drive Quick Acess వంటి మిషన్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను తీసుకురావడంలో రాఘవన్ కృషి కూడా ఎంతో ఉంది. రాఘవన్ విద్యార్హతలు విషయానికి వస్తే… ఆయన U.C. Berkeley నుంచి Electrical Engineering and Computer Scienceలో Ph.D పట్టా పొందారు. మద్రాసులోని Indian Institute of Technology (IIT) నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కూడా పూర్తి చేశారు.