Chiranjeevi: Mega154 సెట్ లో కృష్ణంరాజుకు నివాళులు..
ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కోసం నేటి మధ్యాహ్నం వరకు ఉంచారు. మధ్యాహ్నం అంతిమయాత్రగా ఆయన పార్థివదేహాన్ని మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకెళ్తున్నారు. అధికారిక లాంఛనాలతో ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది. ika నిన్న కృష్ణంరాజు గారి ఇంటి వద్ద ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి...

Mega154 Movie Unit pay his Last Respect's to Krishnam Raju
Chiranjeevi: తెలుగుతెరపై రెబల్ స్టార్ లా ఎదిగిన ఒక తార నేల రాలింది. కథానాయకుడి పాత్రలో కూడా యాంటీహీరోయిజం చూపించే ఒక రెబలియన్ శకం, ఇక ముగిసింది. నటుడిగా, కేంద్రమంత్రిగా తెలుగు వారికి అయన అందించిన సేవలు చిరస్మరణీయం. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక అయన లేరు అన్న నిజంతో, ప్రతిఒక్కరు అయనతో ఉన్న జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు.
ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కోసం నేటి మధ్యాహ్నం వరకు ఉంచారు. మధ్యాహ్నం అంతిమయాత్రగా ఆయన పార్థివదేహాన్ని మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకెళ్తున్నారు. అధికారిక లాంఛనాలతో ఈ అంతిమయాత్ర కొనసాగుతుంది.
నిన్న కృష్ణంరాజు గారి ఇంటి వద్ద ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించిన చిరంజీవి, నేడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘Mega154’ షూటింగ్ లో పాల్గొన్నారు. కాగా సెట్ లో కృష్ణంరాజు గారి అకాల మరణానికి చింతిస్తూ చిత్ర యూనిట్ అయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.
Paying tributes to #RebelStar Sri.Krishnam Raju garu along with Team #Mega154
May his soul rest in peace! pic.twitter.com/qv2rZ26ny3
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 12, 2022