Anshi Prabhala: అన్షీ చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది..

భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నాడని భావిస్తున్నాను.. హ్యాహీ బర్త్‌డే.. అంటూ మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు..

Anshi Prabhala: అన్షీ చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది..

Megastar Chiranjeevi About Anshi Prabhala

Updated On : June 2, 2021 / 10:45 AM IST

Anshi Prabhala: ‘‘శ్రీనివాస్ హరిణి గార్ల చిన్నారి అన్షీ ప్రభలా తన బర్త్‌డే సందర్భంగా తాను దాచుకున్న డబ్బులను, సెలబ్రేషన్‌కయ్యే ఖర్చును చిరంజీవి చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న ఆక్సిజన్ బ్యాంక్‌కు ఇచ్చింది..

తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం సంబరం అని చెపుతుంది అన్షీ.. ఆ చిన్నారి ఆలోచనకి, ఆమె వ్యక్త పరుస్తున్న ప్రేమకి నేను ముగ్ధుడిని అయిపోయాను..

అన్షీ చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది.. నన్ను మరింత inspire చేసింది.. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నాడని భావిస్తున్నాను.. హ్యాహీ బర్త్‌డే’’.. అంటూ మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు..