Moto G9 Power కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్

  • Published By: sreehari ,Published On : December 6, 2020 / 01:50 PM IST
Moto G9 Power కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్

Updated On : December 6, 2020 / 2:15 PM IST

Moto G9 Power launching in India: ప్రముఖ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. Moto G 5G స్మార్ట్ ఫోన్ తో సక్సెస్ అయిన మోటోరోలా భారత మార్కెట్లో Moto G9 పవర్ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. Moto G9 పవర్ మొబైల్‌ను డిసెంబర్ 8న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.



మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ వేదికగా ఈ కొత్త మొబైల్ ‘మోటో G9 పవర్’ లాంచ్ కానుంది. ఈ మేరకు మోటోరోలా కంపెనీ కంపెనీ అధికారిక ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా కంపెనీ షేర్ చేసింది.

ఇప్పటికే ఈ మొబైల్‌ను యూరప్‌లో లాంచ్ కాగా.. ధర రూ.17,400 (199 యూరోలు)గా నిర్ణయించారు. ఈ మోటో జీ9 పవర్ స్మార్ట్ ఫోన్‌ 6000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. HD+IPS LCD డిస్ ప్లేతో పంచ్ హోల్ డిజైన్‌తో వస్తోంది.



స్పెషిఫికేషన్లు+ ఫీచర్లు :
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
* 6.8-అంగుళాల HD+(720×1,640 పిక్సెల్స్) IPS డిస్‌ప్లే
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
* 4GB ర్యామ్ 128GB, Micor SD (512GB)
* 64MP ప్రైమరీ సెన్సార్‌, f/1.79 లెన్స్‌, 2MP కెమెరా f/2.4 లెన్స్‌, మాక్రో సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌ కెమెరా f/2.4 లెన్స్‌
* సెల్ఫీల 16MP కెమెరా f/2.2 ఎపర్చర్‌
* మోటరోలా మోటో G9 పవర్‌, 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 6,000mAh బ్యాటరీ
* Wi-Fi 802.11 AC, బ్లూటూత్ 5.0, NFC, USB Type-C, 3.5mm ఆడియో జాక్, 4G LTE
* బరువు 221 గ్రాములు, 9.66mm
* ఎలక్ట్రిక్‌ వయిలెట్‌, మెటాలిక్‌ సేజ్‌ కలర్స్