సోషల్ సర్వీస్‌లో నాగార్జున.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ శంకుస్థాపన..

సోషల్ సర్వీస్‌లో నాగార్జున.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ శంకుస్థాపన..

Updated On : December 26, 2020 / 4:22 PM IST

Nagarjuna laid foundation : మొన్నటి వరకు తెలుగు రియాలిటీ షో బిగ్‌ బాస్ సీజన్ 4, ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్న ‘కింగ్’ నాగార్జున ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఆయన సామాజిక కార్యక్రమాలతో సమయం గడుపుతున్నారు. అందులో భాగంగా శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 49లో మొక్కలు నాటారు. కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో నాగార్జున, వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఈఓ శ్రీధర్ రావుతో కలిసి పాల్గొన్నారు.

కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు.. జూబ్లీహిల్స్ సొసైటీ పార్క్ కోసం శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు నాగార్జున స్నేహితుడు సతీష్ రెడ్డి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Nagarjuna

Nagarjuna