Nani: నాని కెరీర్‌లోనే బెస్ట్‌గా ‘దసరా’..?
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన....

Nani Dasara Movie Non Theatrical Rights Sold For Huge
Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ హీరో, ఇప్పుడు వరుసగా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీ ‘‘అంటే సుందరానికీ..’’ అనే సినిమాను పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Dasara: ఊరమాస్ నానీ.. కెవ్వు కేక ‘స్పార్క్ ఆఫ్ దసరా’ గ్లిమ్ప్స్!
ఇక నాని నటిస్తున్న ఈ రెండు చిత్రాలు కూడా రెండు విభిన్నమైన జోనర్ చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే తాజాగా దసరా చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్‌ను భారీ రేటుకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా రూ.45 కోట్లు రాబట్టినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన నాని కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ నాన్-థియేట్రికల్ రైట్స్ సాధించిన మూవీగా నిలుస్తుంది. గతంలో శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి రూ.35 కోట్ల మేర నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
Nani: మార్చిలో ‘దసరా’.. ముహూర్తం పెట్టిన నాని!
ఇప్పుడు ఆ రికార్డును సైతం దసరా అధిగమించడంతో ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులను సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని ట్రాన్స్‌ఫార్మేషన్ ఏ రేంజ్‌లో ఉందో ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్ టీజర్‌లో మనం చూశాం. ఈ సినిమాలో తెలంగాణ యాసలో నాని చేయబోయే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సుకుమార్ శిష్యుడు సతీష్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.