ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్: పాత చెత్త పోస్టులను హైడ్ చేయండిలా!

మీ ఫేస్‌బుక్‌లో చెత్త పోస్టులతో విసిగిపోయారా? పాత పోస్టులతో టైమ్ లైన్ నిండిపోయిందా? స్నేహితులు పంపిన పాత పోస్టులను డిలీట్ చేయడం ఇష్టం లేదా? అయితే ఈజీగా పాత పోస్టులను కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. అవసరం లేని చెత్త పోస్టులను హైడ్ చేసుకునేందుకు ఫేస్‌బుక్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. అదే.. ‘Manage Activity’ ఫీచర్.. దీని ద్వారా సులభంగా అవసరం లేని పోస్టులను హైడ్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాచ్ వైజుగా డిలీట్ చేసుకోవచ్చు. ఈ కొత్త టూల్ ద్వారా యూజర్లు తమ అకౌంట్లోని పాత పోస్టులను ఆర్చివ్ లేదా ట్రాష్ లోకి పంపుకోవచ్చు. ఒకటి తర్వాత మరొకటి లేదా బల్క్ పోస్టులను ట్రాష్ లోకి పంపుకోవచ్చు.
ఈ archive ఫీచర్.. పాత పోస్టులను చూడటానికి ఇష్టపడనివారి కోసం ఫేస్‌బుక్ ప్రవేశపెట్టింది. యూజర్లు తమ పోస్టులను మూవ్ చేసుకునేందుకు Manage Activity ఫీచర్ అనుమతినిస్తుంది. ట్రాష్ పోల్డర్ లోకి మూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. యూజర్లు మ్యానువల్ డిలీట్ లేదా రీస్టోర్ ఎంచుకోకపోతే మాత్రం.. ట్రాష్ పోల్డర్‌లోకి పంపిన పోస్టులు 30 రోజుల తర్వాత డిలీట్ అయిపోతాయి. కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు మల్టీపుల్ పోస్టులను ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు.
పాత పోస్టులను సెర్చ్ చేసి గుర్తించేందుకు వీలుగా ఫిల్డర్స్ డెవలప్ చేసింది కంపెనీ. ప్రత్యేకమైన పోస్టుల నుంచి తేదీల వరకు ఎంపిక చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ Manage Activity అనే ఫీచర్ Facebook Appలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఫేస్ బుక్ లైట్ యాప్ లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. త్వరలో ఫేస్‌బుక్ డెస్క్ టాప్ వెర్షన్ లోనూ మ్యానేజ్ యాక్టివిటీ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు సోషల్ దిగ్గజం పేర్కొంది.
Read: ఫేస్‌బుక్‌తో సరిగమ ఒప్పొందం.. ప్రొఫైల్‌కు పాట పెట్టుకోవచ్చు