Nidhhi Agerwal : సూపర్‌స్టార్ పక్కన ఇస్మార్ట్ బ్యూటీ..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి..

Nidhhi Agerwal : సూపర్‌స్టార్ పక్కన ఇస్మార్ట్ బ్యూటీ..

Nidhhi Agerwal

Updated On : April 24, 2021 / 12:11 PM IST

Nidhhi Agerwal: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దుబాయ్‌లో కొద్దిరోజులు షూటింగ్ జరిగింది.. మహేష్ బాబు పర్సనల్ స్టైలిష్‌కు కరోనా సోకడం, యూనిట్‌లో కొందరికి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో తాత్కాలికంగా షూటింగ్ నిలిపివేశారు..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి’ సాలిడ్ పాట.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం చెమటోడుస్తున్న సూపర్‌స్టార్..

దీని తర్వాత మహేష్ – స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యబోతున్నారు.. ఇంతకుముందు వీళ్ల కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి.. ఈ సారి మహేష్ ఇమేజ్‌కి తగ్గట్టు మంచి కథ రెడీ చేశారట త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమా పూర్తవగానే మహేష్ మూవీ స్టార్ట్ కానుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.. మహేష్ పక్కన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను కథానాయికగా ఫిక్స్ చేశారని తెలుస్తోంది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తప్ప కెరీర్‌లో చెప్పుకోవడానికి సరైన సినిమాలేని నిధి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. పవన్, మహేష్ సినిమాలతో అమ్మడికి బ్రేక్ వస్తుందేమో చూడాలి మరి..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి’ సాలిడ్ పాట.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం చెమటోడుస్తున్న సూపర్‌స్టార్..