Bihar Nitish Kumar CM Post : ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా సీఎం కుర్చీ నితీశ్ కే..17 ఏళ్లుగా బీహార్‌ను ఏలుతున్న అపర చాణుక్యుడు

ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్‌దే అన్నట్లుగా ఉంది బీహార్‌ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్‌ కుమార్‌ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ నితీశ్‌కే దక్కుతోంది. తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ... ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌తో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 సీట్లున్న బీహార్‌ అసెంబ్లీలో కేవలం 43 సీట్లు గెలుచుకున్న జేడీయూ పార్టీకి మళ్ళీ సీఎం పగ్గాలు దక్కబోతున్నాయి.

Bihar Nitish Kumar CM Post : ఏ పార్టీకి మెజారిటీ వచ్చినా సీఎం కుర్చీ నితీశ్ కే..17 ఏళ్లుగా బీహార్‌ను ఏలుతున్న అపర చాణుక్యుడు

Bihar Nitish Kumar CM post (1)

Bihar Nitish Kumar CM Post : ఎవరికెన్ని సీట్లు వచ్చినా.. సీఎం సీటు మాత్రం నితీశ్‌దే అన్నట్లుగా ఉంది బీహార్‌ పరిస్థితి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా రాజకీయ అపర చాణుక్యుడు నితీశ్‌ కుమార్‌ సీఎం పీఠాన్ని అట్టిపెట్టుకుని ఉన్నారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా సీఎం కుర్చీ నితీశ్‌కే దక్కుతోంది. తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ… ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌తో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 సీట్లున్న బీహార్‌ అసెంబ్లీలో కేవలం 43 సీట్లు గెలుచుకున్న జేడీయూ పార్టీకి మళ్ళీ సీఎం పగ్గాలు దక్కబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాతో మాట్లాడిన నితీశ్‌కుమార్‌… మహాగట్‌బంధన్‌తో కలిసి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

మార్చి 2000 సంవత్సరంలో నితీశ్‌ కుమార్‌ బీహార్‌ సీఎంగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత 2005 నుంచి 2014వరకు తొమ్మిదేళ్ళు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో జీతమ్‌ రామ్‌ మాంఝి ఏడాది పాటు సీఎం అయ్యారు. ఆ తర్వాతి నుంచి నితీశ్‌ చేతిలోనే సీఎం పగ్గాలు ఉన్నాయి. బీహార్‌లో 2005 నుంచి 2013 వరకు బీజేపీ, జేడీయూ పొత్తు కొనసాగింది. బీజేపీ మద్దతుతో రెండుసార్లు సీఎం అయ్యారు నితీశ్‌ కుమార్‌. అయితే 2013లో ఎన్డీయేని వీడిన నితీశ్ కుమార్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమిలో రెండేళ్లకే చీలిక వచ్చింది.

Bihar CM Nitish Kumar Resigned : బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా..ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు!

తిరిగి 2017లో నితీశ్ మళ్లీ ఎన్డీయేతో జతకట్టి సీఎం అయ్యారు. 2020లో బీజేపీతో కలిసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఎప్పుడూ జేడీయూ కన్నా తక్కువ సీట్లే దక్కించుకున్న బీజేపీ.. ఆ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ సీట్లు సాధించింది. అయినప్పటికీ నితీశ్‌ కుమార్‌కే సీఎం సీటును ఆఫర్ చేసింది. దీంతో నక్కతోక తొక్కిన చందంగా నితీశ్‌కు సీఎం పదవి వరించింది. ప్రతి ఎన్నికల్లోనూ పొత్తుపెట్టుకున్న పార్టీలు తమ సీఎం క్యాండిడేట్‌గా నితీశ్‌ కుమార్‌కే జై కొట్టాయి.

బీహార్ మొత్తం 243 అసెంబ్లీ సీట్లుండగా.. ఓ ఆర్జేడీ ఎమ్మెల్యే మృతితో ఒక సీటు ఖాళీ అయ్యింది. ప్రస్తుతం మెజార్టీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో ఆర్‌జేడీకి 79 సీట్లు, కాంగ్రెస్‌కు 19 సీట్లు, సీపీఐఎంఎల్‌కు 12 సీట్లు, సీపీఐకు 4 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీలన్నింటికీ కలిపి 114 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక జేడీయూకు ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలున్నారు. మహాగట్‌బంధన్‌.. జేడీయూ కలవడం వల్ల బలం 159కు చేరుతుంది. వాస్తవానికి కొత్త కూటమిలో ఆర్జేడీకే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి.. ఆ పార్టీ చీఫ్ తేజస్వియాదవ్ సీఎం కావాలి.. కాని తేజస్వి ఆ ఛాన్స్ నితీశ్‌కే వదిలేశారు.