Parvati Nair: ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న మలయాళ ముద్దుగుమ్మ!

అందం ఎంత ఉన్నా అది సోషల్ మీడియాలో పెట్టకపోతే కొందరికి నిదురపట్టదు. ఉన్న టాలెంట్ మన వద్దే ఉంచేసుకుంటే ఎలా.. దర్శక, నిర్మాతలకు తెలిస్తే కదా అవకాశాలొచ్చేది అనుకుంటారో ఏమో కానీ కొందరు సోషల్ మీడియా ఆయుధంగా బాగా పాపులర్ అయిపోతుంటారు.

Parvati Nair: ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న మలయాళ ముద్దుగుమ్మ!

Parvati Nair

Updated On : April 23, 2021 / 4:56 PM IST

Parvati Nair: అందం ఎంత ఉన్నా అది సోషల్ మీడియాలో పెట్టకపోతే కొందరికి నిదురపట్టదు. ఉన్న టాలెంట్ మన వద్దే ఉంచేసుకుంటే ఎలా.. దర్శక, నిర్మాతలకు తెలిస్తే కదా అవకాశాలొచ్చేది అనుకుంటారో ఏమో కానీ కొందరు సోషల్ మీడియా ఆయుధంగా బాగా పాపులర్ అయిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే సినిమా అవకాశాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోజులతోనే సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంటారు. ఆ కోవలోకే వస్తుంది పార్వతీ నాయర్. సాధారణ తెలుగు ప్రేక్షకులకు పార్వతీ పెద్దగా తెలియదు కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగానే తెలుసు.

అలానే మలయాళ, తమిళ ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం పార్వతీ నాయర్. ఈ మధ్యకాలంలో మన సెలబ్రిటీలంతా పొలోమని మాల్దీవులకు చెక్కేసి ఎంజాయ్ చేస్తున్న సంగతి మనం చూస్తున్నదే కదా.. పార్వతీ నాయర్ కూడా ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. మాల్దీవులంటేనే అందమైన లొకేషన్స్, బీచ్. వాటిని చూస్తుంటేనే రొమాంటిక్ మూడ్ ఉంటుందని వెళ్లిన సెలబ్రిటీలు చెప్పే మాట. మామూలుగానే పార్వతీ లాంటి అమ్మడులకు నిండుగా బట్టలేసుకోవడం మా చెడ్డ చిరాకు. అలాంటిది రొమాంటిక్ లొకేషన్స్ లో ఊరికే ఉంటుందా?

బికినీకి ఎక్కువ.. స్కర్ట్ కి తక్కువనే చిట్టి పొట్టి బట్టలేసుకున్న ఈ మళయాళ ముద్దుగుమ్మ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. అమ్మడి క్లివేజ్ షో చూసి ఆమె ఫాలోవర్లు తెగ పరేషాన్ అయిపోతున్నారు. ఫోటోలకే పిచ్చెక్కిపోతుంటే నా ఫిట్‌నెస్‌ ట్రైనర్ ఇలా చేస్తే ఎంత సర్‌ప్రైజ్ ఫీలయ్యానో అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. మా జోష్ మీట్‌లో అనుకోకుండా ఊహించని విధంగా నన్ను పైకెత్తి సర్‌ప్రైజ్ చేశాడు మైఖేల్ అజయ్.. నేనైతే షాకయ్యా అంటూ కామెంట్ చేసింది పార్వతి నాయర్. ఇక మైఖేల్ కూడా అంతే రేంజిలో ట్యాగ్ చేశాడు. అయితే.. వీడియో చూసిన అమ్మడి అభిమానులే వీరి రొమాంటిక్ స్టంట్స్ చూసి అబ్బో అనుకుంటున్నారు!

Read: Vakeel Saab: వచ్చే నెలలో ఓటీటీలో విడుదల ప్రచారం.. నిజమేంటంటే?