ట్రాఫిక్ e-challanలు పెండింగ్ లో ఉన్నాయా ? ఇంటికే ట్రాఫిక్ పోలీసులు!

  • Published By: madhu ,Published On : December 10, 2020 / 11:18 AM IST
ట్రాఫిక్ e-challanలు పెండింగ్ లో ఉన్నాయా ? ఇంటికే ట్రాఫిక్ పోలీసులు!

Updated On : December 10, 2020 / 12:04 PM IST

Pending e-challan : ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయా ? ఇంకా కట్టలేదా ? అయితే..ట్రాఫిక్ పోలీసులు తర్వలోనే మీ ఇంటి తలుపు తట్టనున్నారు. పెండింగ్ లో ఉన్న చలాన్ల ఫీజులను వసూలు చేసేందుకు కార్యచరణనను రూపొందిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ముంబై మహానగరంలో e-challanలు భారీగా పేరుకపోతున్నాయి. వాహనదారుల నుంచి రూ. 317 కోట్లు రావాల్సి ఉందని అంచనా. దీనిని క్లియర్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి..జరిమానాలను వసూలు చేయాలని డిసైడ్ అయ్యారు.



ఇందుకు ఇద్దరు పోలీసులతో 11 బృందాలు ఏర్పాటు చేశారు. ఇంటికి వెళ్లేముందు..సమాచారాన్ని కాల్ సెంటర్ ద్వారా వాహనదారుడికి తెలియచేస్తారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను రికవరీ వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఇందుకు అనుమతినివ్వాలంటూ..హోం మంత్రిత్వ శాఖను కోరింది. కానీ..ఇంకా అనుమతి రాలేదని తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి నుంచి జరిమానాలను వసూలు చేయడానికి e-challan సిస్టంను ప్రవేశపెట్టారు. నాలుగేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా..చెల్లింపు చేయడంలో వాహనదారులు విఫలమయ్యారు.



ప్రోత్సాహకరంగా లేకపోవడంతో భారీగా బకాయిలు పేరుకపోయాయి. ఇప్పటి వరకు 29 లక్షలు చెల్లించని e-challanలు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. సాధారణ కలెక్షన్ల ఏజెంట్ల మాదిరిగా..ఎవరూ అసభ్యకరంగా పవర్తించరని ట్రాఫిక్ అధికారి వెల్లడించారు. వాహనదారుడు జరిమాన చెల్లించడానికి సిద్ధంగా ఉంటే..నగదు తీసుకుని దానికి సంబంధించిన రశీదును ఇవ్వడం జరుగుతుందన్నారు. జరిమాన చెల్లించనిపక్షంలో..త్వరగా డబ్బులు కట్టాలని సిబ్బంది కోరుతారన్నారు.



ఇప్పటికే కాల్ సెంటర్ ద్వారా సుమారు 2 వేల మంది వాహనదారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. మొత్తంగా 50 శాతం మేర e-challanలు తిరిగి పొందాలని నగర ట్రాఫిక్ విభాగం ప్రణాళిక వేసింది. మరి వారు సక్సెస్ అవుతారో లేదో చూడాలి.