MLA Raja Singh: ప్రజల ఆశీర్వాదం వల్లే నేను, నా కుటుంబం బతికి బయటపడ్డాం: రాజాసింగ్

అమర్‌నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్.. వరదల నుంచి తృటిలో తప్పించుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ... నిన్న అమర్‌నాథ్‌లో భారీగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని, అటువంటి వ‌ర‌ద‌ల‌ను త‌న‌ జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మిలిటరీ అధికారుల సేవల వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదని ఆయ‌న తెలిపారు.

MLA Raja Singh: ప్రజల ఆశీర్వాదం వల్లే నేను, నా కుటుంబం బతికి బయటపడ్డాం: రాజాసింగ్

Raja Singh

Updated On : July 9, 2022 / 10:59 AM IST

MLA Raja Singh: తెలంగాణ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను, త‌న‌ కుటుంబం బతికి బయటపడ్డామ‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. అమర్‌నాథ్ యాత్రలో ఉన్న ఆయన వరదల నుంచి తృటిలో తప్పించుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ… నిన్న అమర్‌నాథ్‌లో భారీగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని, అటువంటి వ‌ర‌ద‌ల‌ను త‌న‌ జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. మిలిటరీ అధికారుల సేవల వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరగలేదని ఆయ‌న తెలిపారు.

Amalapuram: తోటి ఉద్యోగుల ముందే కుప్పకూలి.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

శ్రీనగర్ ప్రాంతానికి త‌మ‌ కుటుంబం సుర‌క్షితంగా చేరుకుంద‌ని రాజాసింగ్ చెప్పారు. మిలిటరీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం ఎక్కువ జరగకుండా చూశారని అన్నారు. తాను బస చేసిన ప్రాంతం ప్రజలతో, మాట్లాడిన ప్రాంతం వరదతో ముంచెత్తిందని చెప్పారు. తామున్న ప్రదేశానికి కేవలం కిలోమీటరు దూరంలోనే వరదలు వచ్చాయని తెలిపారు.