Vijayawada: విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతం
విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతమైంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్ ఫాంపై ఈ నెల 8న తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పాప అపహరణకు గురైన విషయం తెలిసిందే.

Kidnaped Girl
Vijayawada: విజయవాడలో అపహరణకు గురైన చిన్నారి కేసు సుఖాంతమైంది. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని పదో నంబర్ ప్లాట్ ఫాంపై ఈ నెల 8న తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పాప అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఆంజనేయులు, షేక్ మిర్జా వలి దంపతులకు షఫీదా (3) అనే పాప ఉంది. శివాంజనేయులు, షేక్ మిర్జా వలి చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు రైల్వేస్టేషన్‌లో ఉంటున్నారు. కిడ్నాప్‌నకు గురైన వారి పాప షేక్ షఫీదా కోసం ఆరు రోజులుగా పోలీసులు గాలించారు.
National Herald case: అందుకే రాహుల్ అంటే బీజేపీ భయపడుతోంది: కాంగ్రెస్
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసులో దర్యాప్తు కొనసాగించారు. గుడివాడకు చెందిన ఇద్దరు మహిళలు పాపని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. చివరకు, పాపను కిడ్నాప్ చేసిన ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పాపను తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా షఫీదా తల్లి షేక్ మిర్జా వలి 10 టీవీతో మాట్లాడుతూ.. ఆరు రోజులగా పాప కోసం విలపించామని, ఈ రోజు పాపను పోలీసులు తమకు అప్పజెప్పారని తెలిపారు.
congress: ఏ నేరంపై విచారణ జరుపుతున్నారని అడిగితే సమాధానం లేదు: చిదంబరం
గుడివాడకి చెందిన ఇద్దరు మహిళలు పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని పోలీసులు తమకు చెప్పారని అన్నారు. చివరకు కేసును ఛేదించి పాపను తమకు అప్పజెప్పడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. తమ పాప గురించి 10 టీవీలో ప్రసారం చేశారని అన్నారు. 10 టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. తమ పాపను అపహరించిన ఇద్దరు మహిళలను కఠినంగా శిక్షించాలని కోరారు. తాను అనుభవించిన మనోవేదనను ఏ తల్లిదండ్రులు అనుభవించకూడదని అన్నారు.
bjp: 10 లక్షల ఉద్యోగాలు ప్రకటించి యువతలో మోదీ నమ్మకాన్ని నింపారు: కేంద్ర మంత్రులు
అనంతరం ఆ పాప తండ్రి శివాంజనేయులు 10 టీవీతో మాట్లాడుతూ… గుంటూరుకు చెందిన కొంతమందికి తమ పాపను రెండు లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసులు చెప్పారని వివరించారు. పాప ఆచూకీ తెలియ ఆరు రోజులుగా తమ కుటుంబం పడిన బాధను ఎవరూ పడకూడదని, నిందితులను శిక్షించాలని కోరారు. ఆరు రోజుల నుంచి తమ పాప కోసం నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో తమ పాపను గాలించి, ఆచూకీ గుర్తించి, తమకు అప్పజెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 10 టీవీకి తమ పాప గురించి ప్రచారం చేయటం వల్లే ఆమె తమకు దొరికిందని అన్నారు. 10 టీవీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.