bjp: 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ప్ర‌క‌టించి యువ‌త‌లో మోదీ న‌మ్మ‌కాన్ని నింపారు: కేంద్ర మంత్రులు

దేశంలో ఏడాదిన్న‌ర‌లో యుద్ధ ప్రాతిపదికన 10 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప‌లు ప్ర‌భుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సూచించడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

bjp: 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ప్ర‌క‌టించి యువ‌త‌లో మోదీ న‌మ్మ‌కాన్ని నింపారు: కేంద్ర మంత్రులు

Narendra Modi, Amith Shah

bjp: దేశంలో ఏడాదిన్న‌ర‌లో యుద్ధ ప్రాతిపదికన 10 ల‌క్ష‌ల ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్టాల‌ని ప‌లు ప్ర‌భుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సూచించడంపై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మోదీ నిర్ణయాన్ని కొనియాడారు. ”ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో దేశంలోని 10 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆధునిక భార‌త్ అభివృద్ధిలో యువ‌త భాగ‌స్వామ్యం ఎంత‌గా ఉండ‌నుందో మోదీ నిర్ణ‌యాన్ని బ‌ట్టి తెలుస్తోంది” అని పీయూష్ గోయ‌ల్ అన్నారు.

presidential elections: విపక్షాల మధ్య లోపిస్తున్న ఐక్యత.. రేపటి భేటీకి దూరంగా సీఎంలు

”న్యూ ఇండియాకు దేశ యువశక్తే ఆధారం. యువ‌త సాధికార‌త కోసం మోదీ కృషి నిరంత‌రాయంగా కృషి చేస్తున్నారు. ఏడాదిన్న‌ర‌లో యుద్ధ ప్రాతిప‌దిక‌న 10 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంతో యువ‌త‌లో ఆత్మ‌విశ్వాసం, బంగారు భ‌విష్య‌త్తుపై న‌మ్మ‌కం నెల‌కొంటాయి. ఈ గొప్ప నిర్ణ‌యాన్ని తీసుకున్నందుకు మోదీకి కృత‌జ్ఞ‌త‌లు” అని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మ‌న దేశ యువ‌త‌కు విస్తృతంగా ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి మోదీ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారంటూ కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ కొనియాడారు.