National Herald case: అందుకే రాహుల్ అంటే బీజేపీ భ‌య‌ప‌డుతోంది: కాంగ్రెస్‌

దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ రేటు, ద్ర‌వ్యోల్బ‌ణం, చైనా చొర‌బాట్ల‌పై ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌శ్నిస్తోంటే బీజేపీ భ‌య‌ప‌డుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శలు గుప్పించింది.

National Herald case: అందుకే రాహుల్ అంటే బీజేపీ భ‌య‌ప‌డుతోంది: కాంగ్రెస్‌

Surjewala

National Herald case: దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగ రేటు, ద్ర‌వ్యోల్బ‌ణం, చైనా చొర‌బాట్ల‌పై ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌శ్నిస్తోంటే బీజేపీ భ‌య‌ప‌డుతోంద‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… రాహుల్ గ‌ట్టిగా ప్ర‌శ్నిస్తోంటే బీజేపీకి ఎందుకు అంత భ‌యం అని నిల‌దీశారు. చైనా చొరబాట్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం మౌనం వ‌హిస్తే, దీనిపై రాహుల్ గాంధీ ప్ర‌శ్నించార‌ని చెప్పారు. ఇప్పుడు కూడా చైనా తీరుపై కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా ప్ర‌తిస్పందించ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

congress: ఏ నేరంపై విచార‌ణ జ‌రుపుతున్నార‌ని అడిగితే స‌మాధానం లేదు: చిదంబ‌రం

దేశంలో పెరిగుతోన్న‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణంపై కూడా రాహుల్ గళం విప్పుతున్నార‌ని ఆయ‌న అన్నారు. నిరుద్యోగ ప‌రిస్థితులు, కుదేల‌వుతోన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై నిల‌దీస్తున్నార‌ని చెప్పారు. అందుకే రాహుల్ గాంధీపై కేంద్ర ప్ర‌భుత్వం ఆగ్ర‌హంతో ఉంద‌ని చెప్పారు. దేశంలో నిరుద్యోగ రేటు 50 ఏళ్ల గ‌రిష్ఠానికి చేరుకుంద‌ని, రూపాయి మార‌కం విలువ 75 ఏళ్ల క‌నిష్ఠానికి చేరింద‌ని విమ‌ర్శించారు.

National Herald case: రాహుల్ గాంధీని రెండో రౌండ్‌లో విచారిస్తోన్న ఈడీ.. మండిప‌డ్డ ఖ‌ర్గే

కాగా, నేష‌నల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో రాహుల్ గాంధీని సోమ‌వారం ఈడీ దాదాపు 10 గంట‌ల‌పాటు విచారించింది. ఈడీ కార్యాల‌యం నుంచి రాహుల్ గాంధీ రాత్రి 11 గంట‌ల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చి, అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లారు. నేడు కూడా రాహుల్‌ను ఈడీ విచారిస్తోంది.