Radha Death Case: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసును చేధించిన పోలీసులు.. కట్టుకున్న వాడే కడతేర్చినట్లు నిర్ధారణ

సాప్ట్‌వేర్ ఇంజనీర్ రాధ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్నవాడే కడతేర్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Radha Death Case: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసును చేధించిన పోలీసులు.. కట్టుకున్న వాడే కడతేర్చినట్లు నిర్ధారణ

Software Radha Death case

Radha Death Case – Kanigiri : సాప్ట్‌వేర్ ఇంజినీర్ రాధ హత్యకేసు ఊహించని మలుపుతిరిగింది. తన చిన్ననాటి స్నేహితుడు కాశిరెడ్డి అప్పు తిరిగి చెల్లించలేక రాధను హత్యచేసినట్లు తొలుత పోలీసులు భావించారు. కాశిరెడ్డిసైతం పరారీలో ఉండటంతో అతనికోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. అయితే, కాశిరెడ్డికి డబ్బులు ఇచ్చిన విషయంపై రాధకు, ఆమె భర్తకు మధ్య తరచూ గొడవులు జరగుతుండేవి. ఈ విషయంపై ఫోకస్ చేసిన పోలీసులు.. మృతురాలు రాధ భర్త మోహన్ రెడ్డిని విచారించారు. ఈ విచారణలో కట్టుకున్న వాడే కడతేర్చినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కనిగీరిలోని టిట్కో హౌస్ ల వద్ద కారుతో తొక్కించి, రాళ్లతో బాది చంపినట్లు పోలీసుల ఎదుట భర్త మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు.

Software Engineer Radha Case: క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు.. రాధ పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు..

వివాహేతర సంబంధం అనుమానంతోనే..
కేతిరెడ్డి కాశిరెడ్డికి రాధకు మధ్య వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ చనువుతోనే తాను వద్దని చెప్పినా వినకుండా రూ.80లక్షలమేర అప్పు ఇప్పించిందని భర్త మోహన్ రెడ్డి అనుమానాలు పెంచుకున్నాడు. ఈ అనుమానంతోనే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. హత్య అనంతరం వెలిగండ్ల మండలం జిల్లేళ్లపాడు అడ్డరోడ్డు వద్ద మృతదేహాన్నిపడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు విచారణలో మోహన్ రెడ్డి చెప్పాడు. రాధ పేరున ఉన్న రూ. 1.50కోట్ల ఇన్సూరెన్స్ ఉంది.

Mahabubabad : ఐదు నెలల్లో ఒకే కుటుంబంలో ముగ్గురి మరణం.. భర్త, కొడుకు మృతిని తట్టుకోలేక వృద్ధురాలు కన్నుమూత

రాధ హత్యకు పక్కా‌ప్లాన్ ..
భార్య రాధను హత్యచేసేందుకు భర్త మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈ హత్యలో కేసులో కాశిరెడ్డిని ఇరికించేందుకు అతని పేరుతో చాట్ చేశాడు. హైదరాబాద్‌లో చెరకురసం దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళ‌కు చెందిన మెబైల్‌ను ఒకసారి మాట్లాడి ఇస్తానని తీసుకుని అందులో సిమ్ మోహన్ రెడ్డి కొట్టేశాడు. అనంతరం హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండా ఓ కారును రెంటుకు తీసుకుని స్వయంగా డ్రైవ్ చేసినట్లు పోలీసుల గుర్తించారు. మరోకారును హైదరాబాద్ నుండి తీసుకొచ్చి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద ఉంచాడు. హత్యకు ఎర్ర అద్దెకారును ఉపయోగించాడు. అనంతరం ఎర్రకారులో పిడుగు‌రాళ్లకు వెళ్లి అక్కడ ఉంచిన కారులో మోహన్ రెడ్డి తెలంగాణకు వెళ్లాడు.

Lady Singham Death Case: అసలేం జరిగింది..? వెలుగులోకి సంచలన ఆడియో క్లిప్.. సీబీఐ విచారణకు అస్సాం లేడీ సింగం మృతి కేసు

చెరకు రసం మహిళ చెప్పడంతో..
కనిగీరిలోని పామురు బస్టాండ్ వద్ద ఎర్రకారులోని వ్యక్తులతో రాధా మాట్లాడినట్లు ఆ కారులో ఎక్కినట్లు పోలీసులు సీసీ పుటేజ్‌ల ద్వారా గుర్తించారు. రాధ భర్త అనుమానిత కదలికలపై పోలీసుల్లో అనుమానాలు తలెత్తాయి. దీంతో భర్త మోహన్‌రెడ్డి‌పై పోలీసులు దృష్టిసారించారు. హత్య జరిగిన అర్దరాత్రే మోహన్ రెడ్డే ఈ హత్యకు కారకుడని కీలక మెబైల్ సిమ్ చైంజ్ ఆధారాన్ని పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారంగా రాధతో కాశిరెడ్డి పేరున చాట్ చేసిన నంబర్‌ను ట్రైస్ చేయడంతో ఐఎంఈ నంబర్ కోడ్ ఆధారంగా చూడగా సంగారెడ్డి ప్రాంతం వద్ద హత్యకు ముందు ఉపయోగించిన సిమ్ చైంజ్ చేసి తన సిమ్ వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చెరుకు రసం దుకాణం మహిళ వద్ద మోహన్ రెడ్డి, కాశిరెడ్డిల ఫోటోలు చూపించగా, తన సిమ్ కొట్టేసింది మోహన్ రెడ్డేనని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. దీంతో హత్యపై పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రాధ పోస్ట్‌మార్టం తరువాత, సూర్యపేట జిల్లా కోదాడలో అంత్యక్రియలు ముగిసిన అనంతరం మోహన్ రెడ్డిని అతని తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరుగా సిఎస్ పురం పోలీస్టేషన్‌కు తీసుకెళ్లారు.

PM Modi Japan Visit: హిరోషిమాలో రెండోరోజు.. అణుదాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళి..

మోహన్‌రెడ్డితో పాటు ఇంకెవరున్నారు?
రాధ హత్యలో మోహన్ రెడ్డి‌తోపాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కాశిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాధ, కాశిరెడ్డిల మధ్య ఉన్న సంబంధం ఏంటి?, హత్య అనంతరం అజ్ఞానంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?, మొదట పోలీసులు కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ ఎందుకు పెట్టాడు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విచారణ ఈరోజు సాయంత్రం‌లోపు పూర్తి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Primitive Human Signs : హైదరాబాద్ లో ఆదిమానవుని ఆనవాళ్లు.. 6 వేల ఏళ్ల నాటి రాతి గొడ్డళ్లు

భర్తకు రూ. 25లక్షలు ఇచ్చిన రాధ..
కాశిరెడ్డి తీసుకున్న అప్పు చెల్లించక పోవడంతో కట్టుకున్న భర్త, అత్త వేధింపులు తాళలేకపోతున్నానని రాధ తన తండ్రి సుధాకర్ రెడ్డికి చెప్పింది. దీంతో తన భావమరిది బెంగుళూరులో డాక్టర్ అయిన రమణారెడ్డి వద్ద 25లక్షలు తీసుకొచ్చి ఇవ్వడంతో ఆ డబ్బును రాధ భర్త మోహన్‌రెడ్డి‌కి ఇచ్చింది. ఇంత చేసినకూడా తాము అల్లారు ముద్దు‌గా పెంచుకున్న తన కూతుర్ని అత్యంత క్రూరంగా చంపిన మోహన్ రెడ్డికి ఉరిశిక్ష పడేలా చూడాలని, మరో మహిళ‌కు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అదే సరైన శిక్ష అంటూ మృతురాలు రాధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.