Lady Singham Death Case: అసలేం జరిగింది..? వెలుగులోకి సంచలన ఆడియో క్లిప్.. సీబీఐ విచారణకు అస్సాం లేడీ సింగం మృతి కేసు

అస్సాం మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా మృతి కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.

Lady Singham Death Case: అసలేం జరిగింది..? వెలుగులోకి సంచలన ఆడియో క్లిప్.. సీబీఐ విచారణకు అస్సాం లేడీ సింగం మృతి కేసు

Junmoni Rabha (File Photo)

Junmoni Rabha Death Case: అస్సాం మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా (30) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విధితమే. అయితే, ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె మరణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీఐడీ విభాగం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా రాభా మృతికేసు విచారణ సీబీఐకి బదిలీ చేయనున్నారు. ఈ మేరకు అసోం పోలీసులు సిఫారసు చేసినట్లు డీజీపీ జీపీ సింగ్ చెప్పారు. ఆమె పనిచేసిన నాగోన్, లఖింపూర్ జిల్లాల ఎస్పీలు ఆమె మరణంతో సంబంధం ఉన్న కేసులను కూడా సీబీఐకి బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

Junmoni Rabha : ఘోర రోడ్డు ప్రమాదంలో లేడీ సింగం దుర్మరణం.. అసలేం జరిగిందంటే

సీఐడీ విభాగం, పోలీసు ప్రధాన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమీక్షించిన తరువాత రాభా మృతికి సంబంధించిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు డీజీపీ సింగ్ తెలిపారు. అసోం రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగానూ రాభా ప్రజాదరణ పొందారు. ఈ క్రమంలో ప్రజల సెంటిమెంట్‌ను పరిగణలోకి తీసుకొని ఆమె మరణానికి సంబంధించిన కేసును సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించినట్లు డీజీపీ జీపీ సింగ్ తెలిపారు.

PM Modi Japan Visit: హిరోషిమాలో రెండోరోజు.. అణుదాడిలో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళి..

రాభా ఎలా మరణించిందంటే..

లేడీ సింగంగా గుర్తింపు పొందిన అసోం పోలీస్ అధికారి(సబ్ ఇన్‌స్పెక్టర్) జున్మణి రాభా మంగళవారం నాగోవ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాభా ప్రయాణిస్తున్న కారుని ఓ కంటైనర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాభాని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రాభా కారుని ఢీకొట్టిన కంటైనర్ ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆ కంటైనర్‌ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత కంటైనర్ డ్రైవర్ పారిపోయాడు. అయితే, గురువారం కంటైనర్ డ్రైవర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడిని యూపీకి చెందిన సుమిత్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. అయితే, రాభా మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పక్కా ప్లానింగ్ తో జరిగిన హత్యగా ఆమె తల్లి సుమిత్రా రాభా ఆరోపించారు.

MLA Anil Kumar Yadav: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. పై నుంచి కింది దాకా వలిచేస్తా

పోస్టుమార్టం నివేదికలో ఎముందంటే ..

లేడీ సింగంగా పేరుపొందిన జున్మణి రాభా మృతికి సంబంధించి పోస్టుమార్టం నివేదికలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె పక్కటెముకలు రెండు వైపుల ఫ్రాక్చర్ అయ్యాయని గుర్తించారు. బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా రాభా మరణించిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అంతేకాక ఆమె రెండు మోకాళ్లు, మోచేతులు, చేతులపై గాయాలు కనిపించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ప్రమాదం సమయంలో జున్మణి రాభా యూనిఫాంలో లేరు. తన ప్రైవేట్ కారులో ఒంటరిగా వెళ్తుంది. ఆమె సివిల్ దుస్తుల్లో ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారో తమకు ఎటువంటి క్లూ లభించలేదని పోలీసులు తెలిపారు.

Dress Code : ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్.. పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు

సంచలన ఆడియో వెలుగులోకి..

రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని పేర్కొంటూ ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. కారు ప్రమాదం జరిగిన సమయంలో జున్మణి రాభా కారు నిలిపే ఉందని, ఆ సమయంలో ట్రక్కు వచ్చి కారును ఢీకొట్టిందని వీడియోలో పేర్కొన్నాడు. ట్రక్కు ఢీకొట్టేకంటే ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయారని చెప్పడంతో ఈ కేసు సంచలనంగా మారింది. మరోవైపు పోలీస్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు చిత్రహింసలు పెట్టి చంపారంటూ ఓ కానిస్టేబుల్ ఆడియో క్లిప్ విడుదల చేసినట్లు తెలిసింది. దీంతో సదరు కానిస్టేబుల్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

KKR vs LSG: ఉత్కంఠ పోరులో కోల్‌క‌తా ఓట‌మి.. ప్లే ఆఫ్స్ చేరిన ల‌క్నో

అనేక క్లిష్టమైన కేసులు ఛేదించిన ఘనత..

ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా డీల్ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రాభాకు పేరుంది. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తనుసైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. పలు అభియోగాలతో గతేడాది జూన్‌లో అరెస్ట్ కావడంతో ఆమె సస్పెండ్ అయ్యారు. కొంతకాలానికి సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో ఆమెకు మోరికొలాంగ్ ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జిగా పనిచేశారు.