Junmoni Rabha : ఘోర రోడ్డు ప్రమాదంలో లేడీ సింగం దుర్మరణం.. అసలేం జరిగిందంటే
Lady Singham : ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా డీల్ చేశారు. మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను సైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.

Junmoni Rabha(Photo : Google)
Lady Singham Junmoni Rabha : లేడీ సింగం, దబాంగ్ కాప్ గా గుర్తింపు పొందిన అసోం పోలీస్ అధికారి(సబ్ ఇన్ స్పెక్టర్) జున్మోనీ రభా మృతి చెందారు. నాగోవ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. రభా ప్రయాణిస్తున్న కారుని ఓ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రభాని ఆసుపత్రికి తరలించారు.
కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా డీల్ చేశారు సబ్ ఇన్ స్పెక్టర్ రభా. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను సైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. పలు అభియోగాలతో సస్పెండ్ అయ్యారు.
Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం
మంగళవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పెట్రోల్ పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. జున్మోని రభాని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయింది. రభా కారుని ఢీకొట్టిన కంటైనర్ ఉత్తరప్రదేశ్ కు చెందినది. పోలీసులు ఆ కంటైనర్ ని సీజ్ చేశారు. ప్రమాదం తర్వాత కంటైనర్ డ్రైవర్ పరార్ అయ్యాడు.
ఎస్ఐ జున్మోని రభా సివిల్ దుస్తులో, సెక్యూరిటీ లేకుండానే ఒక్కటే తన ప్రైవేట్ కారులో అప్పర్ అసోం వైపు వెళ్లింది. ఆమె ఒక్కటే అక్కడికి ఎందుకు వెళ్లిందో తమకు కూడా తెలియదని కుటుంబసభ్యులు తెలిపారు. మొరికోలాంగ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జున్మోని రాభా, క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించారు. అదే సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డ చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
గత ఏడాది జూన్‌లో అవినీతికి పాల్పడిందనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఇది ఆమె సస్పెన్షన్‌కు దారితీసింది. తర్వాత సస్పెన్షన్ ఎత్తివేయబడింది. ఆమె తిరిగి డ్యూటీలో చేరింది. జనవరి 2022లో బిహ్‌పురియా నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె టెలిఫోనిక్ సంభాషణ లీక్ కావడంతో ఆమె మరో వివాదంలో చిక్కుకుంది.
“చట్టవిరుద్ధంగా” అమర్చిన యంత్రాలతో కంట్రీ బోట్‌లను నడుపుతున్నందుకు కొంతమంది బోట్‌మెన్‌లను జున్మోని రభా అరెస్టు చేసిన తర్వాత మరియు ఆమె భుయాన్ నియోజకవర్గ ప్రజలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించిన తర్వాత వారు వాగ్వాదానికి దిగారు.