Rats Ate Marijuana: 581కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయన్న పోలీసులు.. కోర్టు ఏమన్నదంటే?

ఎలుకలు వందల కిలోల గంజాయిని తిన్నాయా..? కొంచెం వింతగానే ఉన్నా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా కోర్టుకు పోలీసులే ఈ విషయాన్ని చెప్పారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి..

Rats Ate Marijuana: 581కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయన్న పోలీసులు.. కోర్టు ఏమన్నదంటే?

Rats Ate Marijuana

Updated On : November 24, 2022 / 10:15 PM IST

Rats Ate Marijuana: ఎలుకలు వందల కిలోల గంజాయిని తిన్నాయా..? కొంచెం వింతగానే ఉన్నా మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా కోర్టుకు పోలీసులే ఈ విషయాన్ని చెప్పారు. పోలీసుల నివేదిక చూసి విస్తుపోయిన అదనపు జిల్లా జడ్జి.. అందుకు తగిన సాక్ష్యాన్ని ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ.. ఆ ఎలుకలు తినేసిన గంజాయి విలువ ఎంతోతెలుసా.. అక్షరాలా అరవై లక్షల రూపాయలంట.

Marijuana smuggling : విశాఖ నుంచి తరలిస్తున్న 10క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్న సంగారెడ్డి పోలీసులు

ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలో మథర పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 581 కిలోల గంజాయిని 386 కేజీలను షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో భద్రపరచగా, దాదాపు 195 కేజీలను హైవే పోలీస్ స్టేషన్‌లో దాచిపెట్టారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌డిపిఎస్ చట్టం కింద నమోదైన కేసులో రికవరీ చేసిన గంజాయిని సమర్పించాలని మధుర పోలీసులను కోర్టు కోరింది. స్పందనగా పోలీసులు గంజాయి మొత్తాన్ని ఎలుకలు స్వాహా చేశాయని కోర్టులకు నివేదించారు.

Marijuana : గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ‘ప్రజాప్రతినిధి’

కోర్టు మాత్రం పోలీసులు తెలిపిన వివరాలను నమ్మశక్యంగా లేవని, తగిన సాక్ష్యాన్ని ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. హైవే పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చోటె లాల్ కథనం ప్రకారం.. అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదాములోకి నీళ్లు చేరి గంజాయి మొత్తం పాడైపోయిందని అన్నారు. షేర్‌గఢ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సోను కుమార్ కూడా ఇలాంటి కారణమే చెప్పడం పోలీసుల నివేదికపై అనుమానాలను రేకెత్తిస్తోంది.