Prabhas – Ram Charan : స్నేహితుల సినిమాకు ప్రభాస్ – రామ్ చరణ్ సపోర్ట్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ఏక్ మినీ కథ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఆసక్తికరంగా ఉంది.. ఈ సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు, నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని పోస్ట్ చేశారు.

Prabhas And Ram Charan Support To Ek Mini Katha Movie
Prabhas – Ram Charan: అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’.. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో మే27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఏక్ మినీ కథ’ ప్రమోషన్ కంటెంట్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Ek Mini Katha: ‘ఐ హేట్ మై లైఫు.. కష్టాలకే కేరాఫు’.. ట్రైలర్ కిరాక్ ఉందిగా..!
ఈ నేపథ్యంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ఏక్ మినీ కథ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఆసక్తికరంగా ఉంది.. ఈ సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు, నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని పోస్ట్ చేశారు..
Looks like a unique & genuine attempt.
My best wishes to the team!
Watch #EkMiniKatha on Amazon Prime from May 27. https://t.co/5kafKsegRz pic.twitter.com/mahIWvvS7a— Ram Charan (@AlwaysRamCharan) May 24, 2021
అలాగే ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ‘ఏక్ మినీ కథ’ ట్రైలర్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శోభన్ దర్శకత్వంలో వచ్చిన వర్షం చిత్రం తన కెరీర్ లోనే ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని, ఈ మెమురబుల్ సక్సెస్ తనకు అందంచిన శోభన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ఇప్పడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ మే 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు, ఏక్ మినీ కథ చిత్ర బృందానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని ప్రభాస్ పోస్ట్ చేశారు..
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథ అందించారు. కార్తీక్ రాపోలు డైరెక్ట్ చేశారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్, గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, సత్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ‘ఏక్ మినీ కథ’ యూనిట్..