Prabhas : ‘అందరూ బాగుండాలి.. థియేటర్‌లో మనందరం ఉండాలి’..

‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌..

Prabhas : ‘అందరూ బాగుండాలి.. థియేటర్‌లో మనందరం ఉండాలి’..

Prabhas Wishing Ali And Enitre Team Of Andaru Bagundali Andulo Nenundali A Blockbuster Success

Updated On : June 25, 2021 / 5:11 PM IST

Andaru Bagundali Andulo Nenundali: సీనియర్ నరేష్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో సినిమాను తీశారు. సినిమా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా అలీకి అభినందనలు తెలియచేశారు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌.

ALI

 

ఆయన మాట్లాడుతూ.. ‘‘అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే బ్యానర్‌ పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్‌ సౌండ్‌ బావుంది. ఈ సినిమా విషయానికి వస్తే ‘వికృతి’ అనే మలయాళ సినిమాను తెలుగులో ‘‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’’ అనే పేరుతో రీమేక్‌ చేశారు. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో తెలుగులో విడుదలవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేసిన రాకేష్‌ను ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారట. అలీ, నరేష్ గార్లతో పాటు టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

అలీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్‌తో నేను ‘యోగి’, ‘బుజ్జిగాడు’, ‘ఏక్‌ నిరంజన్‌’,‘ బిల్లా’, ‘రెబల్‌’ ఇలా అనేక చిత్రాల్లో నటించిన పరిచయంతో మా సినిమా మొదటి సాంగ్‌ రిలీజ్‌ చేయాలి అని అడిగాను. ప్రభాస్‌ ఇండియాలో లేనప్పటికి నా మీద అభిమానంతో మా సినిమా గురించి మాట్లాడుతూ వీడియో చేసి పంపించారు. మా ‘అందరూ బాగుండాలి…’ సినిమా ప్రమోషన్‌ను ప్రభాస్‌తో ప్రారంభించటం ఆనందంగా ఉంది. మా సినిమా మొదటి పాట లహరి మ్యూజిక్‌ ద్వారా మార్కెట్‌లో విడుదలవుతుంది. కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. పరిస్థితులు చక్కదిద్దుకోగానే విడుదల తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు.