Putin: ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను పంపారో..: పుతిన్ వార్నింగ్

Putin2
Putin: పాశ్చాత దేశాలు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను అందిస్తే తాము కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని దాడులు చేయాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఇంతకు ముందు దాడులు చేయని ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటారు? ఎటువంటి శ్రేణి క్షిపణులను రష్యా వాడాలనుకుంటోంది? అన్న అంశాలను పుతిన్ వివరించలేదు. ఉక్రెయిన్‌కు కొత్త ఆయుధాలను పంపిస్తే ఘర్షణను మరింత పెంచిన వారు అవుతారని అన్నారు.
Uttar Pradesh Violence: పార్టీ నేతలు నురూప్ శర్మ, నవీన్ కుమార్‌పై బీజేపీ సస్పెన్షన్
ఉక్రెయిన్ హిమాస్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టంలను పంపుతామని ఇటీవల అమెరికా ఓ ప్రకటన చేసింది. ఆ వ్యవస్థల ద్వారా ఒకేసారి క్షిపణులను వదిలి 80 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయవచ్చు. ఈ నేపథ్యంలో పుతిన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. అమెరికాకు చెందిన హిమాస్ మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టంల లక్ష్య పరిధి శ్రేణి కంటే రష్యా వద్ద ఉన్న సిస్టంల శ్రేణి తక్కువగా ఉంటుందని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఉక్రెయిన్‌కు పాశ్చాత దేశాలు పలుసార్లు సాయం చేశాయి. దీంతో అనుకున్నంత త్వరగా ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకోలేకపోతోంది.