Rajinikanth – Mohan Babu : రజినీకాంత్, మోహన్ బాబు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ అంట.. సుధీర్ బాబుకి ఇంత పెద్ద కొడుకులున్నారా..!

సూపర్‌స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్, డా.మంచు మోహన్ బాబు పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి..

Rajinikanth – Mohan Babu : రజినీకాంత్, మోహన్ బాబు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ అంట.. సుధీర్ బాబుకి ఇంత పెద్ద కొడుకులున్నారా..!

Rajinikanth Mohan Babu And Sudheer Babu Family Pics Goes Viral

Updated On : May 21, 2021 / 4:36 PM IST

Rajinikanth – Mohan Babu: సూపర్‌స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్, డా.మంచు మోహన్ బాబు పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి..

రజినీకాంత్, మోహన్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.. అడపాదడపా ఇరువురు కలుస్తుంటారు. ఇటీవల రజినీ నటిస్తున్న కొత్త సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది.. అప్పుడు ఈ ఫ్రెండ్స్ కలిశారు.. రజినీ, మోహన్ బాబు ఇద్దరు వైట్ కుర్తాలో మెరిసిపోయారు. ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని సరాదాగా ఫొటోలకు ఫోజులిచ్చారు. వీరితో పాటు మంచు విష్ణు కూడా ఉన్నారు..

సుధీర్ బాబు, సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ గారి చిన్నమ్మాయి ప్రియదర్శినిని వివాహం చేసుకున్నారు. వీరికి చరిత్ మానస్, దర్శన్ ఇద్దరు బాబులు.. చరిత్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘భలే భలే మగాడివోయ్’ మూవీలో నాని చిన్నప్పటి రోల్ చేశాడు.. రీసెంట్‌గా ఇద్దరు బాబులకు ధోతీ ఫంక్షన్ నిర్వహించారు. ఆ పిక్స్ చూసిన వారంతా సుధీర్ బాబుకి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు..