Agnipath: ‘అగ్నిపథ్’ బంగారంలాంటి ఛాన్స్.. కొన్నిరోజుల్లో నియామక ప్రక్రియ షురూ: రాజ్‌నాథ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆ పథకాన్ని సమర్థిస్తూ, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు.

Rajnath Singh If Harmed, India Won't Spare Anyone Rajnath Singh's Message To China
Agnipath: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతోన్న వేళ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాత్రం ఆ పథకాన్ని సమర్థిస్తూ, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు. యువత దేశ రక్షణ రంగంలో చేరడానికి ఈ పథకం బంగారం లాంటి అవకాశమని ఆయన చెప్పుకొచ్చారు. రెండేళ్ళుగా ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ‘అగ్నిపథ్’ పథకం కింద వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచామని ఆయన చెప్పారు.
congress: ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలి: రాహుల్, ప్రియాంకా గాంధీ
ఈ ఏడాదికి మాత్రమే రెండేళ్ళ వయోపరిమితి పెంపు వర్తిస్తుందని, దీని వల్ల చాలా మంది యువత లబ్ధి పొందనున్నారని తెలిపారు. నియామక ప్రక్రియను కొన్ని రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆర్మీలో చేరేందుకు యువత సిద్ధం కావాలని రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. కాగా, అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రులు మాత్రం ఈ పథకాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. ఈ పథకం వల్ల యువతకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని అమిత్ షా కూడా ట్వీట్ చేశారు.