Ram Charan: విశ్వక్ సేన్ వ్యక్తిత్వానికి నేను వీరాభిమానిని.. రాంచరణ్!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తమిళ చిత్రం 'ఓ మై కడవులే' కు రీమేక్ గా వస్తున్న సినిమా "ఓరి దేవుడా". ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ ని ఆకాశానికి ఎత్తేసాడు చరణ్.

Ram Charan Comments on Vishwak Sen at Ori Devuda Pre Release Event
Ram Charan: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’ కు రీమేక్ గా వస్తున్న సినిమా “ఓరి దేవుడా”. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ ని ఆకాశానికి ఎత్తేసాడు చరణ్.
Ram Charan: ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాంచరణ్..RC15 గురించి షాకింగ్ న్యూస్!
“ఫలక్‌నామా నుంచి రాజమండ్రి వరకు గల్లీ గల్లీలో విశ్వక్ కి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మీరు అతని నటనకు అభిమానులు అయ్యారేమో, నేను అతని వ్యక్తిత్వానికి అభిమానిని అయ్యా. మంచో తప్పో మాట ఇస్తే నిలబడతాడని ఇండస్ట్రీలో పేరుంది. సినిమాలు హిట్ అవుతాయి, ప్లాప్ అవుతాయి, కానీ పర్సనాలిటీ వల్ల నలుగురిలో నిలిచిపోతాం.
రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి నటులు అలానే ప్రజల్లో నిలిచిపోయారు. నువ్వు కూడా ఎప్పటికి ఆ వ్యక్తిత్వాన్ని వదులుకోకు” అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే తాను గతంలో రాజమండ్రిలో జరిగిన ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాను. అది రూ.100 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ కూడా అంతటి హిట్ అవ్వాలని వెల్లడించాడు. దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రేమ దేవుడుగా కనిపించబోతున్నాడు.