Evaru Meelo Koteeswarulu: రానాకు ఫోన్ చేసిన రామ్ చరణ్.. షో పేరు మార్చిన ఎన్టీఆర్!
బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన తారక్ 'ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)' పేరుతో సందడి చేస్తున్నారు.

Ntr Rana
Evaru Meelo Koteeswarulu: బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ పేరుతో సందడి చేస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా రాగా చాలా సరదాగా సాగింది. హాట్ సీటులో హీటు పుట్టించే ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పేశారు. చివరకు రూ.25లక్షలు గెలుచుకున్నారు. రామ్ చరణ్, తాను గెలుచుకున్న ఈ డబ్బును చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు డొనేట్ చేశారు. ఈ క్రమంలోనే షోలో ఓ ప్రశ్నకు సమాధానం తెలియక కనుక్కునేందుకు హీరో రానాకి ఫోన్ చేశారు రామ్ చరణ్.
రానాకు ఫోన్ చేసినప్పుడు అడిగిన ప్రశ్న.. 1971 బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్.ఎస్. ఘాజీ అసలు పేరేంటి? అంటూ ప్రశ్నించి నాలుగు ఆప్షన్లుగా A) చెరోకి B) హెర్క్యలీస్ C) ఫోర్డ్ D) డియాబ్లో అని ఇచ్చారు. లైఫ్‌లైన్‌లో రానా డియాబ్లో అనే సమాధానం ఇవ్వగా ఆన్సర్ కరెక్ట్ అని చెప్పారు ఎన్టీఆర్.
ఫస్ట్ ఎపిసోడ్‌లో శ్రీశ్రీ కవితతో అదరగొట్టిన తారక్.. హోస్ట్‌గా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ అడిగిన పలు ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానాలు చెప్పగా.. ఆర్ఆర్ఆర్ హీరోలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. మొదట్లో సులువైన ప్రశ్నలకు సమాధానం చెప్పిన చరణ్.. ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన విషయాలు, తన బాబాయి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ‘కొమరం భీమ్’ పాత్రలో నటించడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు ఎన్టీఆర్. అల్లూరి సీతారామరాజుగా.. కొమరం భీమ్‌గా ఎంతో కష్టపడి గొప్ప యోధుల పాత్రల్లో నటించడంతో మా జన్మ ధన్యమైంది అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు.
ఆచార్య సినిమాపై పలు ప్రశ్నలు అడిగారు తారక్.. దానిపై స్పందించిన రామ్ చరణ్ .. నాన్న చిరంజీవితో పూర్తి స్థాయిలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో నటించేటపుడు స్కూల్లో ప్రిన్స్‌పల్‌తో ఎలా ఉంటానో అలాగా ప్రవర్తించానని చెప్పారు.
ఇక అంతక ముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఉండే పేరును తారక్ ఎందుకు మార్పించారు అనే విషయాన్ని కూడా వెల్లడించారు. “డు” అనేది నాకు నచ్చలేదు.. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా “షో”కి వస్తారు కాబట్టి, పేరు మార్చాను. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ తారక్ చెప్పుకొచ్చారు.