Rashmika Mandanna: రష్మిక బాలీవుడ్ మూవీ అప్పుడే ఓటీటీ బాటపట్టిందిగా!

అందాల భామ రష్మిక మందన ఇప్పటికే దక్షిణాదిన ఎలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుందంటే, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నేషనల్ క్రష్‌గా గుర్తింపును తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘గుడ్ బై’ అనే సినిమాలో అమితాబ్‌తో కలిసి రష్మిక నటించగా, ఇటీవల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యింది.

Rashmika Mandanna: రష్మిక బాలీవుడ్ మూవీ అప్పుడే ఓటీటీ బాటపట్టిందిగా!

Rashmika Mandanna Bollywood Movie Good Bye Locks OTT Date

Updated On : November 22, 2022 / 5:42 PM IST

Rashmika Mandanna: అందాల భామ రష్మిక మందన ఇప్పటికే దక్షిణాదిన ఎలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుందంటే, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ఇప్పటికే టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా, తమిళంలోనూ విజయ్‌తో కలిసి వారిసు సినిమాలో నటిస్తోంది. అయితే నేషనల్ క్రష్‌గా గుర్తింపును తెచ్చుకున్న రష్మిక బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ‘గుడ్ బై’ అనే సినిమాలో అమితాబ్‌తో కలిసి రష్మిక నటించగా, ఇటీవల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యింది.

Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఆశలు ఏమయ్యాయి?? బాలీవుడ్ లో రష్మికకి సరైన ఎంట్రీ పడలేదా??

అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చినా కమర్షియల్‌గా మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో గుడ్‌బై చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 02 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.

Rashmika Mandanna: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రష్మిక.. రీల్ కాదు రియల్!

ఈ సినిమాను వికాస్ బాహ్ల్ డైరెక్ట్ చేయగా, అమిత్ త్రివేది సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి రష్మిక బాలవుడ్ మూవీకి ఓటీటీలో ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.