Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఆశలు ఏమయ్యాయి?? బాలీవుడ్ లో రష్మికకి సరైన ఎంట్రీ పడలేదా??

రష్మిక 2020 లోనే బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసింది. వన్ బై వన్ చేస్తూ వస్తోంది కానీ సక్సెస్ మాత్రం కొట్టలేదు. మొన్నీమధ్య అమితాబ్, నీనాగుప్తా జంటగా రష్మిక లీడ్ రోల్ లో నటించిన గుడ్ బై సినిమా............

Rashmika Mandanna : రష్మిక బాలీవుడ్ ఆశలు ఏమయ్యాయి?? బాలీవుడ్ లో రష్మికకి సరైన ఎంట్రీ పడలేదా??

Rashmika Mandanna bollywood dreams

Rashmika Mandanna :  సౌత్ లో సుబ్బరంగా సక్సెస్ లు కొడుతోంది. స్టార్ హీరోలతో వరస పెట్టిసినిమాలు చేస్తూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతలోనే నార్త్ నుంచి పిలుపొచ్చింది. ఇంకేముంది మకాం ముంబైకి మార్చేసింది. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నేషనల్ క్రష్మిక రెండేళ్ల నుంచి షటిల్ సర్వీస్ చేస్తూ సినిమాలు చేస్తోంది కానీ బాలీవుడ్ లో రష్మికకి సరైన ఎంట్రీ పడిందా అంటే డౌటే.

పూజాహెగ్డే , కియారా లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో పాటు సమంత లాంటి స్టార్ హీరోయిన్లు సౌత్ లో టాప్ హీరోయిన్లు గా రన్ అవుతున్న టైమ్ లో రష్మిక వచ్చి అందర్నీ తన వైపుకు లాగేసుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరస పెట్టి సక్సెస్ లు కొట్టింది. ఈ దెబ్బతో బాలీవుడ్ కూడా రష్మికకి పిలిచి మరీ ఆఫరిచ్చింది. దీంతో అందరి హీరోయిన్స్ లాగే బాలీవుడ్ పిలవగానే వెళ్ళిపోయింది రష్మిక. అయితే ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ అంత గ్రాండ్ గా రష్మకకు వెల్ కమ్ చెప్పలేదు అనుకోవచ్చు.

రష్మిక 2020 లోనే బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేసింది. వన్ బై వన్ చేస్తూ వస్తోంది కానీ సక్సెస్ మాత్రం కొట్టలేదు. మొన్నీమధ్య అమితాబ్, నీనాగుప్తా జంటగా రష్మిక లీడ్ రోల్ లో నటించిన గుడ్ బై సినిమా ధియేటర్లో రిలీజ్ అయ్యింది. రివ్యూస్ పర్వాలేదనిపించినా కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేకపోయింది. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో రిలీజ్ అయిన తన ఫస్ట్ సినిమా రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేసిన రష్మిక హిట్ కాకపోవడంతో కాస్త డిజప్పాయంట్ అయ్యింది.

నిజానికి రష్మిక 2020లో మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సిద్దార్ద్ మల్హోత్రా హీరోగా స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ మిషన్ మజ్నులో సిద్దార్ద్ కి జంటగా నటించింది రష్మిక. అయితే ఈ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు. రెండేళ్ల నుంచి గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సాలిడ్ రా స్టోరీ నెక్ట్స్ ఇయర్ జనవరిలో ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి గ్రాండ్ గా ధియేటర్లో రిలీజ్ అవుతుందని అనుకుంది రష్మిక. కానీ జనవరి 18న రష్మిక నటించిన మిషన్ మజ్ను సినిమా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా అంతగా ఆడకపోవడం, నెక్ట్స్ సినిమా మిషన్ మజ్ను అయినా ధియేటర్లో రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తీసుకొస్తుందనుకుంటే ఇదేమో ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

Pawan Kalyan : మొదలైన హరిహర వీరమల్లు.. ఈ సారైనా ఆగకుండా సాగుతుందా..

బాలీవుడ్ మీద మంచి ఆశలతో రష్మిక ఎంట్రీ ఇచ్చినా రష్మికకి మాత్రం తను ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇమేజ్ ని, సక్సెస్ ని సొంతం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. అయితే సినిమాలు రిలీజ్ కాకపోయినా, హిట్ కాకపోయినా రష్మికకి మాత్రం ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఇక బాలీవుడ్ యాడ్స్ అయితే చాలానే ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే చాలా హిందీ యాడ్స్ లో నటించింది రష్మిక. మరి సౌత్ లో వచ్చినంత క్రేజ్ రష్మికకి బాలీవుడ్ లో ఏ సినిమా తెచ్చిపెడుతుందో చూడాలి.